విద్యా హక్కు చట్టానికి 10 ఏళ్లు

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 04:46 AM IST
విద్యా హక్కు చట్టానికి 10 ఏళ్లు

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది.  6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి ఏప్రిల్‌ 1కి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ అది నెరవేరనేలేదు. పలు పరిశ్రమల్లోను..చెత్త ఏరుకుంటు..ఇలా పలు పనులలో బాలబాలికలు మగ్గిపోతుండటమే దీనికి నిదర్శనం. ఈ చట్టాన్ని అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతే దీనికి కారణంగా కనిపిస్తోంది.  విద్యాహక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై బాలబాలిక విద్య విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటు పలు రాష్ట్రాలకు తీవ్రంగా మందలించింది అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టంపై ఎంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయులు భర్తీ కావాల్సి ఉంది. గత రెండేళ్ల నుంచి ఎటువంటి భర్తీలు జరగలేదు.

విద్యాహక్కు చట్టం రూల్స్ 

  • విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 26 ప్రకారం టీచర్స్  ఖాళీలు  10 శాతానికి మించకుండా ఉండాలి. (ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది) 
  • సెక్షన్‌ 23 ప్రకారం ఉపాధ్యాయ నియామక అర్హతలు తప్పనిసరి చేయాలి. 
  • 28 ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్ చేయకూడదు. 
  • సెక్షన్‌ 12 ప్రకారం బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించి, ఉచిత నిర్బంధ విద్య అందించాలి. 
  • ఇలా చట్టంలో ఎన్నో అంశాలు విద్యాహక్కు చట్టంలో  పొందుపరిచినా..అవి అమలుకు నోచుకోకపోవటం విచారకరం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిపస్తోంది. విద్యాహక్కు చట్టానికి 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. పూర్తయిన సందర్భంగానైనా చట్టం అమలుపై సమీక్ష జరిగి పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటారని..ప్రభుత్వ పాఠశాలలను  బలోపేతం చేసి..భావిపౌరులకు గుణాత్మక విద్య అందాలని ఆశిద్దాం..

విద్యాహక్కు చట్టం ఉద్ధేశాలు   

  • విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యను  హక్కు పొందాలని ఈ చట్టం ముఖ్య ఉద్ధేశ్యం. 
  • 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు 92 లక్షల మందికిపైగా  పాఠశాల చదువులకు దూరమయి ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 
  • పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. 
  • స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాలి. 
  • ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు.
  • ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి. దీనికి సంబంధించిన వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంటే దానికి సంబంధించిన నిధులను 55-45 శాతం కేంద్రం రాష్ట్రాలు భరించాలి. 

విద్యాహక్కు చట్టంలోని ముఖ్యంశాలు 

  • దేశం స్వాతంత్య్రం పొందిన దాదాపు అరవై ఏళ్లకు దేశ చరిత్రలో విద్యకి సంబంధించిన కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే విద్యాహక్కు చట్టం- 2009.
  • యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009, ఆగస్టు 26న విద్యాహక్కు బిల్లు ఆమోదం పొందింది. 2009, ఆగస్టు 27న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సంతకాలతో గెజిట్ రూపంలో ఆవిర్భవించింది. ఈ బిల్లు బాలల మౌలిక హక్కు (అధికరణ 21)లో సవరణ చేయడంతో రూపొందింది. దీన్నే 21A అధికరణ అంటారు.
  • రాజ్యాంగంలో ఈ సవరణను 86వ సవరణగా పిలుస్తారు. ఈ బిల్లు 2010, ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం.
  • దేశంలో ప్రతీ బాలబాలికలు బడిలోనే ఉండాలి..ఇదే విద్యాహక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.