Indian Army : ఇండియన్ ఆర్మీలో ఖాళీల భర్తీ

ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో శిక్షణ ఇస్తారు. 49 వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో 56,100 రూపాయలు నెలకు స్టైపెండ్ గా అందిస్తారు.

Indian Army : ఇండియన్ ఆర్మీలో ఖాళీల భర్తీ

Army Jobs

Indian Army : ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ లో 2022 సంవత్సరానికి గాను పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరీశీలిస్తే ఎస్ఎస్సీ టెక్ మెన్ 175, ఎస్ఎస్సీ టెక్ ఉమెన్ 14 , డిఫెన్స్ పర్సనల్ విడోస్ 2 ఖాళీలు ఉన్నాయి.

అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా విభాగాలను అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో శిక్షణ ఇస్తారు. 49 వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో 56,100 రూపాయలు నెలకు స్టైపెండ్ గా అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్శిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్ళకాలం వీరు ఈ ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తరువాత అభ్యర్ధుల ఆసక్తి, సంస్ధ అవసరాల మేరకు శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఎస్ ఎస్ సీ టెక్ మెన్, ఉమెన్ పోస్టులకు 20 నుండి 27 మధ్య వయస్సు కలిగి ఉండాలి. విడోస్ పోస్టులకు సంబంధించి 35 ఏళ్లు వయస్సు మించకుండా ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http//joinindianarmy.nic.in/ సంప్రదించగలరు.