JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
ad

JOBS : చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే కార్పెంటర్లు50, ఎలక్ట్రీషియన్లు156, ఫిట్టర్లు143, మెషినిస్టులు29, పెయింటర్లు50, వెల్డర్లు170, పాసా 2 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదిగా జులై 26,2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://pb.icf.gov.in పరిశీలించగలరు.