గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష : అభ్యర్థులకు రూల్స్ ఇవే

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 03:50 AM IST
గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష : అభ్యర్థులకు రూల్స్ ఇవే

ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 08వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు లోనికి అనుమతినించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా పరీక్ష సమయంలో అభ్యర్థులకు అధికారులు సలహాలు, సూచనలు వెల్లడిస్తున్నారు. 

> జెల్ పెన్ లేదా ఏ ఇతర రాత వస్తువులతో OMR షీట్‌పై ఏదేనా రాస్తే..అది చెల్లదు. 
> ఒరిజనల్ ఓఎమ్మార్ షీట్‌తో పాటు నకలు ఓఎమ్మార్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో కార్బన్ పేపర్ ఉంటుంది. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు ఒరిజనల్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
> పరీక్షకు కేటాయించిన సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటకు పంపియ్యారు. ఎవరైనా అభ్యర్థి నిర్దేశిత సమయానికి కంటే ముందుగానే రాసినా..కేంద్రం విడిచి వెళితే..వారు అనర్హులవుతారు. 
> అభ్యర్థుల హాల్ టికెట్‌పై ఫొటో స్పష్టంగా ఉండాలి. కనిపించకుండా ఉన్నా..అసలు ఫొటోనే ముద్రించకున్నా..ఫొటో ఉండి అభ్యర్థి సంతకం లేకపోతే వారిని లోనికి అనుమతించరు. 
> అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు అదనంగా మూడు పాస్ పోర్టు ఫొటోలను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. 
> పాస్ పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. 
> పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు ఏదైనా అవసరానికి ఓఎమ్మార్ షీట్‌పై వైట్ నర్ లేదా ఏదైనా మార్కర్ వాడితే అనర్హులవుతారు. 
> పరీక్ష హాల్‌లోకి బాల్ పాయింట్ పెన్ మినహా వైట్ నర్, మార్కర్ వంటివి తీసుకొస్తే వారిని అనర్హులుగా గుర్తిస్తారు. 
> అభ్యర్థులు ప్రశ్నాపత్రంతో పాటు సిరీస్ కోడ్..ఇన్విజిలెటర్ సంతకం పెట్టించుకోవాలి. అభ్యర్థి సంతకం తప్పనిసరి.