SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ,బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

SBI JOBS : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ

Sbi Mumbai

SBI JOBS : ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ఏజిఎం 4 ఖాళీలు, మేనేజర్ 2ఖాళీలు, డిప్యూటీ మేనేజర్ 26 ఖాళీలు ఉన్నాయి. ఐటీ, నెట్ వర్క్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, స్టాటిస్టీషియన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ,బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదిగా జూన్ 12,2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sbi.co.in పరిశీలించగలరు.