Mrpl Jobs : ఓఎన్జీసి ఎంఆర్ పీఎల్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి గేట్ 2022 స్కోర్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Mrpl Jobs : ఓఎన్జీసి ఎంఆర్ పీఎల్ లో ఉద్యోగాల భర్తీ

Ongc Mrpl (1)

Mrpl Jobs : భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఓఎన్ జీసి లిమిటెడ్ సబ్సిడరీ సంస్ధ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్ పీఎల్ )లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి గేట్ 2022 స్కోర్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 28, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://mrplgate.recttindia.in/ పరిశీలించగలరు.