Job Vacancies : హైదరాబాద్ నిన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

Job Vacancies : హైదరాబాద్ నిన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Nin Jobs (1)

Job Vacancies : భారత ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్)లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, పీజీ డిగ్రీల్లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అడ్రస్: కాన్ఫరెన్స్ హాల్ అండ్ కమిటీ రూమ్, ఐసీఎమ్ఆర్, నిన్, హైదరాబాద్. ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 4, 2022 గానిర్ణయించారు.