NEET PG 2022 Exam Date : అదంతా ఫేక్.. నీట్‌ పీజీ పరీక్షపై NBEMS క్లారిటీ..!

NEET PG 2022 Exam Date : దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష (NEET Exam)పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

NEET PG 2022 Exam Date : అదంతా ఫేక్.. నీట్‌ పీజీ పరీక్షపై NBEMS క్లారిటీ..!

Neet Pg 2022 Exam Not Postponed, Fake Letter Circulated, Clarifies Govt

NEET PG 2022 Exam Date : దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష (NEET Exam)పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నీట్ పరీక్షను జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్టు ఓ ఫేక్ సర్క్యూలర్ వైరల్ అవుతోంది. దీనిపై నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెన్స్ (NBEMS) క్లారిటీ ఇచ్చింది. నీట్ పరీక్షల తేదీని వాయిదా వేయలేదని షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నట్టు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

వాస్తవానికి నీట్ పరీక్ష 2022 మార్చి 12వ తేదీన జరగాల్సి ఉంది. అనుకోని కారణాల దృష్ట్యా మే 21వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడీ ఈ నీట్ పరీక్షను మరోసారి వాయిదా వేయాలంటూ విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీకి కూడా లేఖలు కూడా రాశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, నీట్ పరీక్ష వాయిదా వేసినట్టుగా ఓ ఫేక్ సర్క్యులర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏప్రిల్‌ 28న నేషన్‌ బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పేరుతో సర్క్యులర్‌లో పరీక్షను జులై 9వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఉంది. దాంతో నీట్ పరీక్ష రాయబోయే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (Fact Check) చేసింది. ఆ సర్క్యులర్‌ ఫేక్ అని తేల్చేసింది. అందులో వాస్తవం లేదని, అసలే నమ్మొద్దని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే.. నీట్ పీజీ పరీక్ష మే 21వ తేదీనే జరుగుతుందని పేర్కొంది.

Read Also : NEET UG 2022 Exam Date : నీట్ పరీక్షల తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?