చెక్ ఇట్: ONGC లో 785 ఖాళీలు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 09:41 AM IST
చెక్ ఇట్: ONGC లో 785 ఖాళీలు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) లో ఇంజనీరింగ్, జియో సెన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 785 ఎగ్జిక్యూటివ్‌ “క్లాస్‌–1” పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్ 2019 స్కోర్ ఆధారంగా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5న ప్రారంభమైంది.

విద్యా అర్హత: 
B.E, B.Tech, M.Tech, M.Sc, GATE -2019 క్వాలిఫై అయినవారే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం 60% మార్కులు ఉండాలి.

విభాగాల వారీ ఖాళీలు:

                  పోస్టులు  ఖాళీలు
మెకానికల్‌(సిమెంటింగ్‌) 10
పెట్రోలియం (సిమెంటింగ్‌) 01
సివిల్‌ 19
మెకానికల్‌ (డ్రిల్లింగ్‌) 86
పెట్రోలియం (డ్రిల్లింగ్‌) 08
ఎలక్ట్రికల్‌ 95
ఎలక్ట్రానిక్స్‌ 24
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 26
మెకానికల్‌ 75
మెకానికల్‌ (ప్రొడక్షన్‌) 64
కెమికల్‌ (ప్రొడక్షన్‌) 80
పెట్రోలియం (ప్రొడక్షన్‌) 33
రిజర్వాయర్‌ 19
ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ 10
కెమిస్ట్‌ 67
జియాలజిస్ట్‌ 68
జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌) 29
జియోఫిజిసిస్ట్‌(వెల్స్‌) 14
మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్స్‌ 33
ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ 13
ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ 11

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఎంపిక విధానం: గేట్‌–2019 స్కోర్‌ ఆధారంగా.