RAILTEL Recruitment : రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఎంపికైన డిప్యూటీ మేనేజర్‌కు నెలకు 40,000-1,40,000. మేనేజర్ పోస్టుకు నెలకు 50,000 నుండి 1,60,000 రూపాయలు, సీనియర్ మేనేజర్‌కు 60,000 నుండి 1,80,000 రూపాయల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు రూ. 1200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. S

RAILTEL Recruitment : రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Railtel Corporation of India Limited

RAILTEL Recruitment : రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ పలు పోస్టులను భర్తీ చేయటనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 మేనేజర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి B.Sc, BE/B.Tech, M.Sc, MCA పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసుకు సంబంధించి డిప్యూటీ మేనేజర్- 21 నుండి 30 సంవత్సరాలు, మేనేజర్- 23 నుండి 30 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్- 27 నుండి 34 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ తరువాత తుదిజాబితా ప్రకటిస్తారు.

READ ALSO : Pimples : మీ ముఖంపై మొటిమ‌లే చెబుతాయి మీ ఆరోగ్యం గురించి..

ఎంపికైన డిప్యూటీ మేనేజర్‌కు నెలకు 40,000-1,40,000. మేనేజర్ పోస్టుకు నెలకు 50,000 నుండి 1,60,000 రూపాయలు, సీనియర్ మేనేజర్‌కు 60,000 నుండి 1,80,000 రూపాయల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు రూ. 1200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ. 600. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 11, 2023 దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.railtelindia.com. పరిశీలించగలరు.