POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ

గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్‌ అందజేస్తారు.

POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ

Power Grid

POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ కార్యాలయాల్లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 425 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Pakistan : టూరిస్ట్ వీసాతో వెళ్లి విదేశాల్లో బిచ్చమెత్తుకుంటున్న పాకిస్థానీయులు, జేబు దొంగలుగానూ మారి సంపాదన

దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్‌, బీఎస్సీతోపాటు గేట్-2024 పరీక్షకు హాజరవుతున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌-2024 ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : Punjab : రోగి కడుపులో రాఖీలు, ఇయర్‌ఫోన్‌లు, స్క్రూలు..ఆపరేషన్ చేసి బయటకుతీసిన వైద్యులు

గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్‌ అందజేస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్‌ ఈ-2 హోదాలో పీజీసీఐఎల్‌ పరిధిలోని నార్తర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిశా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. విధుల్లో చేరిన తరువాత నెలకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

READ ALSO : Bengal Governor : బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానం…పోలీసులను తొలగించిన గవర్నర్

2024 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 18, 2024 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.powergrid.in/ పరిశీలించగలరు.