Non-Teaching Posts : తిరుచిరాపల్లి ఐఐఎంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభంతోపాటు టెక్నికల్ నైపుణ్యం ఉండాలి.

Non-Teaching Posts : తిరుచిరాపల్లి ఐఐఎంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

Iim Trichy Jobs (1)

Non-Teaching Posts : భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన తిరుచిరాపల్లిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆమేరకు మొత్తం 20 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీ చేసింది.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు;

కార్పోరేట్ రిలేషన్స్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్, ప్లేస్ మెంట్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ ఇంజనీర్, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్, హిందీ సూపర్ వైజర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఎడిటోరియల్ అసిస్టెంట్, అకడమిక్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభంతోపాటు టెక్నికల్ నైపుణ్యం ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు ఆయా పోస్టులను అనుసరించి 35 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి. జీత భత్యాల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి నెలకు 25,000 నుండి 1,00,000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులను ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాలి. ధరఖాస్తులకు చివరితేది నవంబరు 24, పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.iimtrichy.ac.in