Bis Jobs : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ లో పోస్టుల భర్తీ

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 348 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల

Bis Jobs : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ లో పోస్టుల భర్తీ

Bis

Bis Jobs : న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 348 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. మెకానికల్, కెమికల్, మైక్రోబయోలజీ, కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ పరీక్ష, ప్రాక్టికల్, ట్రేడ్ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 19, 2022 నుండి మొదలవుతుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 9, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరలకు వెబ్ సైట్ https://www.bis.gov.in/సంప్రదించగలరు.