TS Inter : ఇంటర్ మీడియట్, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మళ్లీ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.

TS Inter : ఇంటర్ మీడియట్, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మళ్లీ పరీక్షలు

Telangana Inter

TS Inter 2021 : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఏప్రిల్‌ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్‌ 70శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో ఛాయిస్‌ పెంచామని పేర్కొన్నారు.

Read More : AP PRC : పీఆర్సీ..రెండు రోజుల్లో క్లారిటీ, సోమవారం ఫిట్‌‌మెంట్ ఖరారు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ ఫలితాలు రాష్ట్రంలో సెగలు రేపాయి. సగం మంది విద్యార్థులూ కూడా పాసవకపోవడం.. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌లో ఫెయిలవడంతో.. ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో.. ఫస్టియర్ ఫలితాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగాయి. పాస్ పర్సంటేజీ తగ్గటానికి కారణం… ఇంటర్ బోర్డేనని ఆరోపించాయి. వెంటనే.. ఫెయిలైన విద్యార్థులందరికీ.. ఉచితంగా రీవాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేశాయి.