కామెడీ మాస్టర్.. ఈయన చెప్పే పాఠం వింటే.. నవ్వు ఆపుకోలేరంతే!

10TV Telugu News

స్కూళ్లో మాస్టర్ పాఠాలు చెబితే విద్యార్థులందరూ సరిగా వింటారా? లేదో తెలియదు కానీ.. ఈ కామెడీ మాస్టర్ పాఠాలు చెబితే మాత్రం విద్యార్థులకు అర్థం కాకుండా ఉండదు.. అదే ఈ మాస్టర్ స్టయిల్.. అర్థం కానీ పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఈయన టీచింగ్ స్టయిల్.. చెప్పే పాఠం ఒక్కటే అయినా చెప్పే విధానంలో కాస్తా స్టయిల్ జోడించారు..


పిల్లలకు ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పాలంటారు.. కరెక్టుగా ఇదే ఫార్మూలాను తన టీచింగ్ స్టయిల్‌తో కలిపి ఆకట్టుకుంటున్నారు మాస్టర్.. ఒకవైపు కామెడీ పండిస్తూనే పిల్లలను ఏకాగ్రతను కోల్పోకుండా హాస్పాస్పదంగా పాఠాలను చెబుతున్నారు.

ఈ మాస్టర్ పాఠాలంటే రోజు వినని విద్యార్థులంతా ఆన్ లైన్ క్లాసులకు మానేయకుండా వచ్చేస్తున్నారంట.. మిగతా సబ్జెక్టుల్లో వచ్చే మార్కుల కంటే ఈయన చెప్పే సబ్జెక్టులోనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారంట.. ఇంకేముంది.. స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులంతా ఖుషీ అయిపోతున్నారు.


ఇప్పుడీ ఈ కామెడీ మాస్టర్ టీచింగ్ స్టయిల్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.. మాస్టర్ పాఠం చెప్పే విధానం చూసినవారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు..సీరియస్ గా పాఠాలు చెబితే విద్యార్థులు శ్రద్ధగా వినరు.. అదే ఇలా కామెడీ మాస్టర్ స్టయిల్ లో పాఠాలు చెబితే బుర్రకు ఎక్కించుకుంటారని అనుకుంటున్నారు.


ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కామెడీ మాస్టర్ టీచింగ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మీరు ఈ వీడియో చూశారంటే నవ్వకుండా ఉండలేరంతే…