Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డ్​ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్​మెంట్​, అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డ్​ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Join Indian Coast Guard

Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డ్​ (ICG)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 నావిక్​, యాంత్రిక్​ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Hyderabad Rain : హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం, బయటకు రావొద్దని హెచ్చరిక

ఖాళీల వివరాలకు సంబంధించి నావిక్​ (జనరల్ డ్యూటీ) 260 పోస్టులు,నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) 30 పోస్టులు, యాంత్రిక్​ (మెకానికల్​)25 పోస్టులు, యాంత్రిక్​ (ఎలక్ట్రికల్​) 20 పోస్టులు,యాంత్రిక్​ (ఎలక్ట్రానిక్స్​)15 పోస్టులు ఉన్నాయి. నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నావిక్​ (జనరల్ డ్యూటీ) పోస్టుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డ్ నుంచి 10+2 క్వాలిఫై కావాలి.

యాంత్రిక్ పోస్టులకు అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, టెలికమ్యునికేషన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.

READ ALSO : Rishi Sunak : హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నా.. రిషి సునక్ వ్యాఖ్యలు వైరల్

ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్​మెంట్​, అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. నావిక్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ వేతనంగా రూ.21,700 చెల్లిస్తారు. యాంత్రిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ వేతనంగా రూ.29,200 అందిస్తారు.

అభ్యర్ధులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్​ 22లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు తుదిగడువుగా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం ;

ముందుగా https://joinindiancoastguard.cdac.in వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి. అనంతరం హోమ్​ పేజ్​లోని ఎన్ రోల్ మెంట్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.

READ ALSO : Alternatives to Sugar : బ్రౌన్ షుగర్, బెల్లం, తేనె వంటివి చక్కెరకు మంచి ప్రత్యామ్నాయాలేనా ?

అనంతరం Online application for DGEPT-01/2024 batch లింక్​పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.

అనంతరం విద్యార్హత పత్రాలు అప్​లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లో చెల్లించి, దరఖాస్తును సబ్​మిట్ చేయాల్సి ఉంటుంది. రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.