NIHFW Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీఈ/బీటెక్‌/ ఐటీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

NIHFW Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in National Institute of Health and Family Welfare

NIHFW Recruitment : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ న్యూఢిల్లీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 17 ఫైనాన్స్/అకౌంట్స్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి ఫైనాన్స్/ అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు: 1 పోస్టు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు: 2, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు: 1, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1, క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1, డేటా అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు: 1, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 1, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు: 1, సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు: 2, డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ డెవలపర్ పోస్టులు: 2, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ పోస్టులు: 1, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పోస్టులు: 1 ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీఈ/బీటెక్‌/ ఐటీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 45 ఏళ్లకు మించరాదు. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు డిసెంబర్ 23, 2022వ తేది తుదిగడువుగా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ బాబా గ్యాంగ్ నాథ్ మార్గ్, మునిర్కా, న్యూఢిల్లీ-110067. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.nihfw.org/ పరిశీలించగలరు.