VIT ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 06:34 AM IST
VIT ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఆధ్వర్యంలో చెన్నై, వెల్లూరు, అమరావతి, భోపాల్ ప్రాంగణాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 9వ తేది నుంచి 10వ తేది వరకు 1 నుంచి 30,000 ర్యాంకు, 11వ తేదిన 30,001 నుంచి 50,000 ర్యాంకు, 13 వ తేదిన 50,001 నుంచి 70,000 ర్యాంకు, 14వ తేదిన 70,000 నుంచి 90,000 ర్యాంకు, 15వ తేది నుంచి 90,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు VIT ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే తెలంగాణ ఇంటర్ విద్యార్థులు తమ మార్కుల జాబితాలను జూలై 12లోగా అందచేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. VITEEE ర్యాంకు పొందినవారందరూ ఈ నెల 9 నుంచి 15వ తేది వరకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ కు హాజరుకావచ్చని తెలిపారు.