By Polls: ఉప ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ పార్టీలదే విజయం

ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో శివసేన విజయం సాధించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణంతో ఆయన భార్య పోటీలో నిలిచి గెలుపొందారు. ఇక లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోక్రా‭నాథ్ నియోజకవర్గం బీజేపీది. కాగా, తాజా ఎన్నికలో బీజేపీ నేతే విజయం సాధించారు. అలాగే బిహార్‭లోని మొకామా స్థానాన్ని ఆర్జేడీ పదిల పరుచుకోగా.. గోపాల్ గంజ్ స్థానంలో మళ్లీ బీజేపీనే గెలుపొందింది. ఒడిశాలోని ధాంగనర్ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ నిలబెట్టుకుంది.

By Polls: ఉప ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ పార్టీలదే విజయం

5 out of 7 assembly seats won by sitting parties in by elections

By Polls: వివిధ రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సిట్టింగ్ పార్టీలే గెలుచుకున్నాయి. మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. అందులో ఐదు స్థానాల్లో గతంలో గెలిచిన పార్టీలే నిలబెట్టుకున్నాయి. కేవలం రెండు స్థానాల్లో సిట్టింగ్ పార్టీ కాకుండా వేరే పార్టీలు గెలిచాయి. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కావడం గమనార్హం.

హర్యానాలోని అదాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం ఉప ఎన్నిక ఏర్పడింది. అయితే అదాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగా, మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయానికి చేరువలో ఉంది.

ఇక ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో శివసేన విజయం సాధించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణంతో ఆయన భార్య పోటీలో నిలిచి గెలుపొందారు. ఇక లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోక్రా‭నాథ్ నియోజకవర్గం బీజేపీది. కాగా, తాజా ఎన్నికలో బీజేపీ నేతే విజయం సాధించారు. అలాగే బిహార్‭లోని మొకామా స్థానాన్ని ఆర్జేడీ పదిల పరుచుకోగా.. గోపాల్ గంజ్ స్థానంలో మళ్లీ బీజేపీనే గెలుపొందింది. ఒడిశాలోని ధాంగనర్ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ నిలబెట్టుకుంది.

బీజేపీ, ఆర్జేడీ, శివసేన పార్టీలు తమ స్థానాలను ఉప ఎన్నికల్లో నిలబెట్టుకున్నాయి. ఎటొచ్చీ కాంగ్రెస్ పార్టీయే నష్టపోయింది. రెండు స్థానాలకు గాను రెండు స్థానాల్లో నష్టపోయింది. అదాంపూర్ నియోజకవర్గంలో రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. మునుగోడు నియోజకవర్గంలో మూడో స్తానానికి పడిపోయింది. ఇందులో ఒకటి బీజేపీ గెలుచుకోగా, మరొక స్థానంలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పరుగులు పెడుతోంది.

By Polls: 7 ఉప ఎన్నికల ఫలితాలు.. బీజేపీ-4, ఆర్జేడీ-1, టీఆరెఎస్-1, శివసేన-1