Karnataka Polls: చిత్తు చిత్తుగా ఓడిపోయిన 11 మంది బీజేపీ మంత్రులు.. వారి పేర్లేంటో తెలుసా?

రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్‌ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి అశోక్‌, తన సొంత నియోజకవర్గం పద్మనాభనగర్‌లో విజయం సాధించారు.

Karnataka Polls: చిత్తు చిత్తుగా ఓడిపోయిన 11 మంది బీజేపీ మంత్రులు.. వారి పేర్లేంటో తెలుసా?

BJP Ministers Lost: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. పార్టీలోని కీలక నేతలు కూడా చాలా చోట్ల ఓడిపోయారు. ఇక బొమ్మై ప్రభుత్వంలోని సగం మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇందులో చాలా మంది భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. బొమ్మై కేబినెట్ లోని సుమారు 11 మంది మంత్రులు ఓడిపోయారు.

1. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌
2. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్‌ నిరాణి
3. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి మాధుస్వామి
4. రవాణాశాఖ మంత్రి శ్రీరాములు, క్రీడలు యువజనులశాఖ మంత్రి నారాయణ గౌడ
5. స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి హాలప్ప ఆచార్‌
6. వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్
7. గృహనిర్మాణశాఖ మంత్రి సోమణ్ణ (రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి)
8. భారీ జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ
9. మునిసిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్
10. విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్
11. రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌
బొమ్మై కేబినెట్‌లో కీలక మంత్రులంతా ఓటమి చెందడం పార్టీకు కోలుకోలేని దెబ్బకొట్టినట్లయింది.

కాగా రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్‌ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి అశోక్‌, తన సొంత నియోజకవర్గం పద్మనాభనగర్‌లో విజయం సాధించారు.