Gujarat Polls: నా రికార్డు బద్ధలవుతుందని ముందే చెప్పాను: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు సాధించింది. ఇక త్రిముఖ పోటీలో భాగంగా ఉన్న ఆప్ ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించింది

Modi says I had told the people of Gujarat that this time Narendra's record should be broken
Gujarat Polls: తన రికార్డు బద్ధలవుతుందని ప్రజలతో ముందే చెప్పానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విక్టరీ సాధించింది. దీనిపై మోదీ పై విధంగా స్పందించారు. ఫలితాల అనంతరం నిర్వహించిన కృతజ్ణతా సభలో మోదీ మాట్లాడుతూ కష్టించి పని చేసి పనిలో కూడా తన రికార్డు బద్ధలవుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అది చేసి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అన్ని రికార్డులు బద్ధలయ్యాయని హర్షం వ్యక్తం చేశారు.
Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు సాధించింది. ఇక త్రిముఖ పోటీలో భాగంగా ఉన్న ఆప్ ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించింది. ఆ పార్టీకి 52.5 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ 27.3 శాతం, ఆప్ 12.9 శాతం ఓట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలు గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది.
Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పాత్రేంటి? కాంగ్రెస్ ఓటమితో బీజేపీ-బీ టీం అంటారా?