Lok Sabha elections 2024: లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీఎం నితీశ్ కుమార్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి పయనం

 రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళిన నితీశ్ కుమార్ ఆయనతో ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.

Lok Sabha elections 2024: లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీఎం నితీశ్ కుమార్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి పయనం

Lok Sabha elections 2024

Lok Sabha elections 2024: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళిన నితీశ్ కుమార్ ఆయనతో ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.

దీనిపై నితీశ్ కుమార్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ… ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడాను. ఢిల్లీకి వెళ్తున్నాను. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలుస్తాను. రాహుల్ గాంధీని కూడా కలిసి చర్చిస్తాను’’ అని చెప్పారు. కాగా, ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న నితీశ్ కుమార్ 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించనున్నారు.

పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలిసి చర్చిస్తారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించి, అనంతరం తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతపై ఇప్పటికే నితీశ్ కుమార్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సమావేశమయ్యారు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్