Bihar Politics: ఓట్లు అడిగిన ప్రజలనే నోట్లు అడుగుతున్న నేత.. వింత పద్దతిలో ఎన్నికల ప్రచారం

సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు

Bihar Politics: ఓట్లు అడిగిన ప్రజలనే నోట్లు అడుగుతున్న నేత.. వింత పద్దతిలో ఎన్నికల ప్రచారం

Saharsa Elections: బీహార్‌లోని సహర్సలో మున్సిపల్ ఎన్నికల్లో వింత ఎన్నికల ప్రచారం కనిపించింది. ఆదివారం సహర్సా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ వార్డుకు చెందిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి సియారాం పాశ్వాన్ వార్డుల వారీగా ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు అడుగుతూనే ప్రజల నుంచి నోట్లు సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా ప్రజల వద్దే ఆయన విరాళాలు సేకరిస్తున్నారు. మెడకు తువ్వాలు చుట్టుకుని, జోలె పట్టుకుని ప్రజల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నారు.

Women on moped : మోపెడ్‌పై ముద్దులు పెడుతూ మహిళలు వీడియో వైరల్

సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు. అదే సమయంలో డిప్యూటీ మేయర్ పదవికి 32 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఓటర్ల గురించి చెప్పాలంటే పురుషులు, మహిళలు కలిపి దాదాపు రెండు లక్షల ఆరు వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏ అభ్యర్థికీ ఎన్నికల గుర్తు రాలేదు. అయితే ప్రచారంలో మాత్రం అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు. ఇక పాశ్వాన్‌‭కు ప్రజల నుంచి మద్దతు కూడా బాగానే వస్తోంది. దీనిపై ఒక మహిళ స్పందిస్తూ.. ‘‘ఈసారి పాశ్వాన్‌ను డిప్యూటీ మేయర్‌గా చేయాలని భావిస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు ఇస్తున్నాం. ఆయన దగ్గర డబ్బు లేదు. చాలా పేదవాడు. అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు విరాళాలు ఇస్తున్నాం. మా చేతనైనంత డబ్బు ఇచ్చాం’’ అని అన్నారు.

Bengaluru rains: బెంగళూరులో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం.. వీడియో

ఇక అభ్యర్థి సియారాం పాశ్వాన్ మాట్లాడుతూ ‘‘మేం పేదవాళ్లం. అందరి నుంచి విరాళాలు అడుగుతున్నాం. ఖర్చు చేయడానికి నా దగ్గర ఆస్తిపాస్తులు లేదు. అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు విరాళాలు అడుగుతున్నాం. ప్రతి వార్డులో తిరుగుతున్నాం. మేమే గెలుస్తాం, ప్రజలందరూ మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పేదలైన మేం రోజురోజుకూ దోపిడీకి గురవుతున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం అందలేదు. ఈసారి సమయం వచ్చింది కాబట్టి ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఓటర్లందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు, ఓటు కూడా వేస్తారు. రోజూ రెండు నుంచి మూడు వేల రూపాయలు విరాళాలుగా అందుతున్నాయి’’ అని అన్నారు.