వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా వస్తే.. ఇతరులకు వ్యాపిస్తుందా?

వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా వస్తే.. ఇతరులకు వ్యాపిస్తుందా?

Covid-19 Vaccines you still corornavirus

Covid-19 Vaccines you still spread corornavirus to others : ప్రపంచమంతా ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్ సహా ఇతర దేశాలన్నీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాయి. అయితే ఈ కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకూ కరోనావ్యాప్తిని అడ్డుకోగలవు అనే సందేహాలు, అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ల సమర్థత, సురక్షితంపై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి నుంచి కరోనావైరస్ ఇతరులకు ఇంకా వ్యాపిస్తుందా? అంటే.. కచ్చితంగా కాదని చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా వ్యాక్సిన్ ప్రతిఒక్కరికి ఎందుకు అవసరమంటే.. హెర్డ్ ఇమ్యూనిటీని పొందవచ్చు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కరోనా వ్యాప్తి తీవ్రతను తగ్గించవచ్చు. క్రమంగా నిర్మూలించవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్-బయోంటెక్, మోడ్రానా టీకాలన్నీ mRNA టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. కోవిడ్-19 వ్యాధి నుంచి ప్రజలను ఈ ఎంఆర్ఎన్ఏ రక్షిస్తుంది. ఇప్పుడు అందరి మదిలో తొలిచే ఒకటే ప్రశ్న.. ప్రతిఒక్కరూ పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా ఒకరినుంచి మరొకరికి కరోనావ్యాప్తి చెందుతుందా? అంటే కాదని చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. ఒకప్పటిలా సాధారణ పరిస్థితులు ఇప్పట్లో సాధ్యపడదని అంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినప్పుడే కరోనా నిర్మూలన సాధ్యపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

అప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ వేయించుకున్నాక వారిలో కోవిడ్-19 ఇమ్యూనిటీ యాంటీబాడీలు తయారవుతాయని చెబుతున్నారు. వ్యాక్సిన్ తర్వాత ఎంతవరకు కరోనా కేసులను నియంత్రించగలదో కచ్చితంగా అంచనా వేయలేమంటున్నారు. టీకా ఇమ్యూనిటీ సమర్థతపై కూడా పూర్తి డేటాను విడుదల చేయలేదు. వ్యాక్సిన్ ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉంటుంది తప్పా పూర్తిగా వైరస్ నిర్మూలించలేమని పరిశోధకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ఎఫ్ డీఏ టీకాకు ఆమోదం తెలిపింది. కానీ, అసింపథిటిక్ బాధిత వ్యక్తుల నుంచి కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందా? లేదా అనేది స్పష్టత లేదు.

ఎందుకంటే… కరోనా లక్షణాల ఆధారంగానే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక వారిలో పూర్తిగా ఇమ్యూనిటీ పొందడానికి కొన్నివారాల సమయం పడుతుంది. ఈ సమయంలో వారికి వైరస్ సోకితే.. వారినుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నావారంతా తప్పనిసరిగా ఎప్పటిలానే ముఖానికి మాస్క్, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.