Alcohol Cancer : మందుబాబులకు షాకింగ్ న్యూస్… మద్యంతో క్యాన్సర్ ముప్పు..!

మీకు మందు తాగే అలవాటు ఉందా? చుక్క పడకుంటే నిద్ర పట్టదా? రోజూ మద్యం తాగాల్సిందేనా? లిక్కర్ లేకుండా ఉండలేకపోతున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. మీకు ఆ ముప్పు పొంచి ఉంది..

Alcohol Cancer : మందుబాబులకు షాకింగ్ న్యూస్… మద్యంతో క్యాన్సర్ ముప్పు..!

Alcohol Cance

Alcohol Cancer : కొందరికి మందు అంటే మహా ఇష్టం. రోజూ పెగ్గు పడాల్సిందే. తిండి, నీరు ఉన్నా లేకపోయినా లిక్కర్ మాత్రం మస్ట్ గా ఉండాల్సిందే. కొందరికి చుక్క పడితే కానీ కంటి మీద కునుకు పట్టదు. అంతగా.. మందుకి అడిక్ట్ అయిపోయి ఉంటారు. అయితే మద్యం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మద్యం తాగితే క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మద్యపానానికి, క్యాన్సర్ కి సంబంధం ఉందని డాక్టర్లు తేల్చారు. 2020లో 7లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించగా, అవన్నీ కూడా మద్యపానంతో సంబంధం కలిగున్నట్టు డాక్టర్లు గుర్తించారు. అమెరికన్లు ఎక్కువగా లిక్కర్ తాగేస్తున్నారు.

లాన్సెట్ అంకాలజీ జూలై 13 ఎడిషన్ లో ఓ అధ్యయనం పబ్లిష్ అయ్యింది. దాని ప్రకారం.. 2020లో వెలుగు చూసిన క్యాన్సర్ కేసుల్లో 4శాతానికి పైగా కేసులు మద్యం తాగడం వల్లే వచ్చాయని గుర్తించారు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకున్న వ్యక్తులు… ఆల్కహాల్ తో ముడిపడి ఉన్న క్యాన్సర్ల బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా లక్ష కంటే ఎక్కువ కేసులు సగటు కంటే తక్కువగా మద్యం తీసుకున్న వ్యక్తులలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంటోంది.

ఆల్కహాల్ ఒక చికాకు కలిగించేది. ఇది మన నోరు, గొంతు, కడుపుని చికాకు పెడుతుంది. మన శరీరం నయం కావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కొన్నిసార్లు మద్యపానం అలవాటు క్యాన్సర్ బారిన పడేందుకు దారి తీస్తుంది” అని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్‌లో ఆంకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ ఓడెల్ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో మద్యం వినియోగం బాగా పెరిగింది. గత సంవత్సరం చేసిన సర్వేలో… దాదాపు మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు తమ మద్యపానం అలవాటు పెరిగిందని చెప్పారు.

సో, మందుబాబులూ బీ అలర్ట్.. అతిగా మద్యం సేవిస్తే ముప్పు తప్పదు. క్యాన్సర్ బారిన పడటం ఖాయం అంటున్నారు డాక్టర్లు. ఏ అలవాటైనా లిమిట్ లో ఉండాల్సిందే. మోతాదు మించితే మూల్యం చెల్లించకోక తప్పదంటున్నారు.