Custard Apple : శీతాకాలం సీజన్‌లో సీతాఫలం తినటం వల్ల కలిగే ప్రయోజనాలు !

సీతాఫలం తినడం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు. రక్తహీనత అనేది ఫోలేట్ లోపం వల్ల వస్తుంది. ఫోలేట్ లోపం , రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి ఫోలేట్ అధికంగా ఉండే సీతాఫలం తీసుకోవడం ప్రయోజనకరం.

Custard Apple : శీతాకాలం సీజన్‌లో సీతాఫలం తినటం వల్ల కలిగే ప్రయోజనాలు !

custard apple

Custard Apple : సీతాఫలాన్ని షరీఫా, చెరిమోయా, షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. సీతాఫలం తినటం వల్ల శారీరక ఆరోగ్యంలో ఉన్న అనేక లోపాలను మెరుగుపరుచుకోవచ్చు. సీతాఫలంలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ సూపర్‌ఫుడ్ వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Keeping Bones Healthy : ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషించే ఇనుముతోపాటు ఇతర విటమిన్లు !

సీతాఫలం యొక్క ప్రయోజనాలు

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ;

అధిక ఆక్సీకరణ ఒత్తిడి అన్నది క్యాన్సర్, గుండె సమస్యలు మొదలైన దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. సీతాఫలంలో కౌరెనోయిక్ యాసిడ్, విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది ;

సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. సీతాఫలం గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. స్ట్రోక్, గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ;

సీతాఫలంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి కాపాడుతుంది. శ

శరీరానికి శక్తిని అందించి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ;

కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమోతాదులో పెరగటం ఆరోగ్యానికి హానికరం. కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయటంలో సీతాఫలం ఉపకరిస్తుంది. ఇందులో నియాసిన్ విటమిన్ ఉంటుంది. నియాసిన్ విటమిన్ తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ , గుండెపోటు నుండి రక్షించుకోవచ్చు.

READ ALSO : Cancer Heart Disease Vaccines : క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!

రక్తహీనతను పోగొడుతుంది ;

సీతాఫలం తినడం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు. రక్తహీనత అనేది ఫోలేట్ లోపం వల్ల వస్తుంది. ఫోలేట్ లోపం , రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి ఫోలేట్ అధికంగా ఉండే సీతాఫలం తీసుకోవడం ప్రయోజనకరం. సీతాఫలంలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. కాబట్టి, సీతాఫలాన్ని ఇతర ఆహార పదార్థాలతో పాటు ఆహారంలో తీసుకుంటే, శరీరంలోని ఇతర ఆహార పదార్థాలలో ఉండే ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.

బరువు పెరగడంలో ;

తక్కువ బరువు కలిగిన వారు సీతాఫల్ తినటం వల్ల బరువు పెరుగుతారు. సీతాఫలం మంచి శక్తి వనరుగా ఉపయోగపడుతుంది. ఇది బరువు పెంచటంలో సహాయపడుతుంది. సీతాఫలంతో పాటు ఇతర ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది.

READ ALSO : Hereditary Heart Disease : వంశపారంపర్యంగా గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి?

ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగిస్తుంది ;

ఉబ్బసం తో బాధపడుతున్న వారు సీతాఫలాన్ని తినటం వల్ల కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. ఇది అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన పండు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిని సూచనలు, సలహాలు పొందటం మంచిది.