Prevent Acute Pancreatitis : జీవనశైలి మార్పులతో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌ సమస్యను నివారించవచ్చా?

ప్యాంక్రియాటైటిస్ ఉన్న వ్యక్తులకు ధూమపానం అలవాటు ఉంటే అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. త్వరగా కోలుకునే స్ధితికి ధూమపానం అడ్డుగా మారుతుంది. ఇది తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Prevent Acute Pancreatitis : జీవనశైలి మార్పులతో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌ సమస్యను నివారించవచ్చా?

Prevent Acute Pancreatitis

Prevent Acute Pancreatitis : అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది క్లోమం వాపుకు గురైన సందర్భంలో అకస్మాత్తుగా ఎదురయ్యే పరిస్ధితి. రోజులు, సంవత్సరాల పాటు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మద్యపానం, పిత్తాశయ రాళ్లు, రక్తంలో అధిక కొవ్వు పదార్థాలు, కొన్ని మందులు వంటి వివిధ కారణాల వల్ల ఇది వస్తుంది. పొత్తికడుపు భాగంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత, పొత్తకడుపు పైభాగంలో నొప్పి కలుగుతుంది.

READ ALSO : Pancreatitis Problem : ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి ? సమస్య తలెత్తితే కనిపించే లక్షణాలు ఇవే!

ఈ సమస్య ప్రధానంగా పిత్తాశయ రాళ్ల వల్ల వస్తుంది. ఈ రాళ్లు పిత్త , ప్యాంక్రియాటిక్ వాహికలో చిక్కుకోవడం ద్వారా మంటను కలిగిస్తుంది. తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులు మరియు జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి.

నిపుణులు ఈ వ్యాధిని నయం చేయడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌ను నివారించడానికి అనుసరించాల్సిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మద్యం మానుకోండి ; ప్యాంక్రియాటైటిస్‌ సమస్యకు ఆల్కహాల్ ఒక సాధారణ కారణం. మద్యం ప్యాంక్రియాస్‌కు హాని కలిగిస్తుంది. మద్యం సేవించకుండా ఉండటం ద్వారా, వ్యాధి కారణంగా దీర్ఘకాలంలో వచ్చే నొప్పిని కూడా తగ్గించవచ్చు.

READ ALSO : Hormones : బరువును ప్రభావితం చేసే హార్మోన్లు ! వాటిని మెరుగుపరచటం ఎలాగంటే?

దూమపానం మానుకోండి ; ప్యాంక్రియాటైటిస్ ఉన్న వ్యక్తులకు ధూమపానం అలవాటు ఉంటే అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. త్వరగా కోలుకునే స్ధితికి ధూమపానం అడ్డుగా మారుతుంది. ఇది తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అనారోగ్యకరమైన ఆహారాన్ని పక్కనపెట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ; అధిక కొవ్వు , వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు, మద్యం,మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు వంటి తక్కువ కొవ్వు ,సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం రికవరీ ప్రక్రియలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ప్రయత్నించండి ; అదనపు బరువు అన్నది ప్యాంక్రియాస్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల నష్టానికి దారితీస్తుంది. బరువు తగ్గడం అన్నది ప్యాంక్రియాస్‌పై ఒత్తిడిని తగ్గేలా చేస్తుంది. దాని పనితీరు సక్రంగా ఉండటానికి తోడ్పడుతుంది. వైద్యం ప్రక్రియలో సహాయపడుతుంది.

READ ALSO : Prediabetes : యువతలో ప్రీడయాబెటిస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందా? సర్వేలు ఏంచెబుతున్నాయ్

తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ కు తక్షణ వైద్య సహాయం అవసరం. అధిక ఫైబర్తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవటంతోపాటు చక్కెరలను పరిమితం చేయడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్ వంటి వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.