కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్.. ఎందుకిలా? ఎవరిలో ఎలా ఉండొచ్చుంటే?

  • Published By: sreehari ,Published On : November 21, 2020 / 11:26 AM IST
కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్.. ఎందుకిలా? ఎవరిలో ఎలా ఉండొచ్చుంటే?

Coronavirus vaccine side effects : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు రేసులో పోటీపడుతున్నాయి.

ఇప్పటికే పలు డ్రగ్ మేకర్లు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, వ్యాక్సిన్ కూడా 90శాతానికి పైగా సురక్షితం, ప్రభావంతంగా పనిచేస్తాయని అంటున్నాయి.



కానీ, వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు పక్కన పెడితే.. వ్యాక్సినేషన్ తర్వాత వాలంటీర్లలో చాలామందిలో దుష్ర్ప‌భావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వ్యాక్సినేషన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి? ఎందుకిలా జరుగుతుంటుంది? ఎవరెవరిలో ఇలా ఎక్కువగా దుష్ర్ప‌భావాలు వచ్చే ఛాన్స్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇటీవలే విడుదలైన ట్రయల్ డేటా ప్రకారం.. మూడు ప్రధాన కరోనా వ్యాక్సిన్లు ( రెండు మూడో దశ ట్రయల్స్, ఒకటి రెండో దశ ట్రయల్) దశలో కొనసాగు తున్నాయి.

గత సోమవారమే Moderna Inc. తమ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. మరోవైపు ఫైజర్ కూడా మూడో దశ ట్రయల్ ఫలితాల డేటాను రిలీజ్ చేసింది.



ఆఖరికి ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, డ్రగ్ మేకర్ అస్ట్రాజెనికా కూడా తమ రెండో దశ ట్రయల్ వ్యాక్సిన్ ఫలితాలను వెల్లడించింది.

ఈ మూడు కరోనా వ్యాక్సిన్లు రోగనిరోధకతను పెంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని ఫలితాల్లో వెల్లడైంది.
https://10tv.in/china-suggests-italy-may-be-the-birthplace-of-covid-19-pandemic/
కానీ, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మాత్రం మూడో ట్రయల్ డేటాలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఏదిఏమైనా ఈ వ్యాక్సిన్ ప్రజలతో సహా అందరికి ఈ ఏడాది ఆఖరిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



ఈ మూడు వ్యాక్సిన్లు వైరస్ ను తట్టుకోగలిగినప్పటికీ.. అనేక సైడ్ ఎఫెక్ట్ లకు దారితీస్తోంది. మోడెర్నా, పైజర్, ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్ డేటా ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఈ మూడు కరోనా వ్యాక్సిన్లలో దుష్ప్రభావాలు ఉన్నాయని తేలింది. ఏయే వ్యాక్సిన్లలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయంటే?..

1. Moderna Vaccine :
మోడెర్నా అంతర్గత మూడో దశ ట్రయల్ డేటా ప్రకారం.. ఈ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అత్యంత సాధారణ దుష్ర్పభావాలు కనిపించాయి. వ్యాక్సిన్ రెండు మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది.

– ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి (ఒక డోస్ తర్వాత)
– అలసట
– కండరాల నొప్పులు
– కీళ్ల నొప్పులు
– వ్యాక్సిన్ వేసిన ప్రాంతంలో ఎర్రపారడం



2. Pfizer vaccine :
ఈ వారమే పైజర్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ ముగిసింది. వ్యాక్సినేషన్ అనంతరం వాలంటీర్లలో అత్యంత సాధారణ దుష్ర్పభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
– అలసట
– తలనొప్పి

3. Astrazeneca/Oxford vaccine :
ఈ వ్యాక్సిన్ ఫలితాలు.. రెండో దశ ట్రయల్ అధ్యయన ఆరంభంలోనివి.. 560 మంది పాల్గొన్నారు. వీరందరికి ప్రామాణిక మోతాదు మాత్రమే ఇచ్చారు.. చాలామందిలో ఎక్కువగా కనిపించిన సాధారణ దుష్ర్పభావాలు ఇలా ఉన్నాయి.

– అలసట
– జ్వరం
– కండరాల నొప్పులు
– వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి
– తాకితే నొప్పిగా అనిపించడం

దుష్ప్రభావాలు ఎందుకొస్తాయంటే? :
వ్యాక్సిన్లలో దుష్ర్పభావాలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలోకి ఏదైనా ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి అలర్ట్ అవుతుంది.

దానిపై పోరాడే క్రమంలో ఏర్పడే మార్పులే దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు.. కొందరిలో ఒకేలా ఉండొచ్చు.. మరికొందరిలో ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.



రెండు ప్రధాన కరోనా వ్యాక్సిన్లలో మోడెర్నా, పైజర్ వ్యాక్సిన్లకు సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు వేయగానే వ్యాధినిరోధక శక్తి స్పందించడం కారణంగా జరుగుతుంటుంది.

ఈ రెండు mRNA వ్యాక్సిన్లు.. కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్ మాదిరి శరీరానికి అవసరం పడుతుంది.. mRNA అనేది తనకు తాను అస్థిరంగా ఉండలేదు.



దీని కారణంగా శరీరంలో లో ఫీవర్, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, ఒళ్లు నొప్పులు వంటి దుష్ర్పభావాలు కనిపిస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండవు.

నాన్ mRNA వ్యాక్సిన్లలోనూ సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ను ప్రేరేపించడం కారణంగా ఇలా జరుగుతుంటుంది. రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తోందనడానికి ఈ లక్షణాలే సంకేతాలుగా చెప్పవచ్చు.



ఎవరిలో ఎక్కువగా దుష్ప్రభావాలు ఉంటాయంటే? :
ఏదైనా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది శరీరంలోకి ప్రవేశించగానే వ్యాధినిరోధక శక్తి వెంటనే స్పందిస్తుంది. ఫలితంగా శరీరంలో ఎక్కడో చోట దుష్ప్రభావాలు కనిపించవచ్చు.

ప్రధానంగా జ్వరం, అలసట, తలనొప్పి ఉండొచ్చు. శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థను బట్టి లక్షణాల తీవ్రత ఆధారపడి ఉంటుంది.

ఒక రోజు లేదా ఆ తర్వాత రోజుల్లో దుష్ప్రభావాలు తగ్గిపోతాయి. అస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో యువకుల కంటే వృద్ధుల్లోనే తక్కువగా దుష్ప్రభావాలు కనిపించాయని రిపోర్టు తెలిపింది.



పైజర్ వ్యాక్సిన్‌ లోనూ యువకులతో పోలిస్తే.. వృద్ధుల్లోనే స్వల్ప స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

చిన్నారుల్లో 105 డిగ్రీల జ్వరం.. అంతకంటే ఎక్కువగా వస్తే.. పెద్దవారిలో మాత్రం ఈ స్థాయిలో జ్వరం వచ్చే అవకాశాలు చాలా అరుదుగా జరుగుతుంటుందని నివేదిక తెలిపింది.