Hydrotherapy : పిల్లల మానసిక అభివృద్ధిలో హైడ్రోథెరపీ ఎలా సహాయపడుతుందంటే ?

ఒత్తిడి, ఆందోళనపై హైడ్రోథెరపీ సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడుతుంది. ఇది పిల్లలు సంతోషంగా, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

Hydrotherapy : పిల్లల మానసిక అభివృద్ధిలో హైడ్రోథెరపీ ఎలా సహాయపడుతుందంటే ?

hydrotherapy

Hydrotherapy : హైడ్రోథెరపీని మరోపేరుతో ఆక్వాటిక్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నీటిని ఉపయోగించటం ద్వారా చేసే ఒక రకమైన భౌతిక చికిత్స. ఈ పద్ధతి ఆర్థరైటిస్, నొప్పి, నరాల సంబంధిత రుగ్మతలతో సహా వివిధ చికిత్సలకు ఉపయోగిస్తారు. పిల్లల మానసిక వికాసానికి హైడ్రోథెరపీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

READ ALSO : ఒత్తిడికి గురవుతున్నారా?

నీటిపై తేలాడేలా ఉంచటం వంటి కార్యకలాపాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. నీటి ఉష్ణోగ్రత కండరాలకు విశ్రాంతినివ్వటంలో సహాయపడుతుంది. కండరాల అభివృద్ధికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. హైడ్రోథెరపీ పిల్లల ఎదుగుదలకు, వైకల్యం ఉన్న పిల్లలకు చికిత్సకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Eating Disorder : పెరిగిన ఒత్తిడి మోతాదుకు మించి ఆహారం తీసుకునే రుగ్మతకు ఎలా దారి తీస్తుంది?

హైడ్రోథెరపీ పిల్లలకు ఆహ్లాదకరమైన, ఆనందింపచేసే కార్యకలాపంగా ఉంటుంది. వారి మానసిక స్థితిని, ఆత్మగౌరవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2020లో, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్ ఉన్న పిల్లలలో శారీరక శ్రమను ప్రోత్సహించేందుకు హైడ్రోథెరపీ అనుకూలంగా ఉంటుందని తేలింది.

పిల్లల మానసిక అభివృద్ధికి హైడ్రోథెరపీ సహాయపడే కొన్ని నిర్దిష్ట మార్గాలు :

1. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది ;

హైడ్రోథెరపీ నీరు సున్నితమైన శరీర కదలికలు, మనస్సుకు విశ్రాంతిని ఇవ్వటానికి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆందోళన రుగ్మతలు, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న పిల్లలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

READ ALSO :  Chronic Loneliness : దీర్ఘకాలిక ఒంటరితనం కేవలం ఒక మానసిక సమస్య కాదా? దీర్ఘకాలిక వ్యాధులను పెంచుతుందా?

2. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ;

ఒత్తిడి, ఆందోళనపై హైడ్రోథెరపీ సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడుతుంది. ఇది పిల్లలు సంతోషంగా, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

3. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది ;

హైడ్రోథెరపీ అనేది పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన, ఆనందింపచేసే ఒక కార్యకలాపం. ఇది వారి ఆత్మగౌరవాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అదనంగా, హైడ్రోథెరపీ శారీరక ,మానసిక ప్రయోజనాలు పిల్లల సామర్థ్యాన్ని మరింత పెంచేలా దోహదనం చేస్తుంది.

READ ALSO : Celebrity Kids : బయటి ప్రపంచానికి దూరంగా సెలబ్రిటీ పిల్లలు.. అసలు చూపించరా??

4. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది ;

హైడ్రోథెరపీ పిల్లలు ఇతరులతో ఎలాంటి బెరకు లేకుండా మాట్లాడటానికి తగిన వాతావరణాన్ని అందిస్తుంది. సహకారం, కమ్యూనికేషన్ వంటి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

READ ALSO : Pregnant Women : చలికాలంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించటం అవసరమా?

5. శారీరక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ;

హైడ్రోథెరపీ పిల్లల సమతుల్యత, సమన్వయం ,కండరాల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎదుగుదల ఆలస్యం, వైకల్యాలున్న పిల్లలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.