అమెరికాలో మూడో కొత్త స్ట్రయిన్ : ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించగలదు.. సైంటిస్టుల హెచ్చరిక

అమెరికాలో మూడో కొత్త స్ట్రయిన్ : ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించగలదు.. సైంటిస్టుల హెచ్చరిక

Newly identified strain of COVID in US : అమెరికాలో కరోనావైరస్ మూడో కొత్త స్ట్రయిన్ బయటపడింది. ఇప్పటికే యూకే కరోనా స్ట్రయిన్‌తో అల్లాడిపోతున్న అగ్రరాజ్యాన్ని మూడో యూఎస్ కొత్త స్ట్రయిన్ వణికిస్తోంది. సౌతరన్ లిల్లినోయిస్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు మూడో యూఎస్ స్ట్రయిన్ ను గుర్తించారు.

ప్రస్తుత కరోనా స్ట్రయిన్ల కంటే అత్యంత వేగంగా అంటువ్యాధులను వ్యాప్తిచేయగలదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యంలో వైరస్ మ్యుటేషన్లతో 50శాతం వరకు అన్ని యూఎస్ కేసులకు పెరిగాయని రీసెర్చర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రేస్ చేసిన ఈ కొత్త స్ట్రయిన్ టెక్సాస్ కు తిరిగి వచ్చినట్టు గుర్తించారు.

గతంలో మే నెలలో మొదటిసారి ఈ స్ట్రయిన్ కనిపించనట్టు బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కేత్ గంగాన్ పేర్కొన్నారు. వైరస్ మ్యుటేషన్ బలమైన RNA జన్యు సమగ్రతతో పాటు వైరల్ ప్రోటీన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందడంలో వేగంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇతర వేరియంట్ల కంటే చాలా తేలికగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.

వ్యాక్సిన్లపై దాని ప్రభావం అనిశ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు COVID-19 వైరస్ భిన్నమైన జాతిని కనుగొన్నారని చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ఫలితాలు బయటపడ్డాయి. యూకే జాతికి సమానమైన మ్యుటేషన్‌ను కలిగి ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.