గోమూత్రం,పేడతో కరోనా వైరస్ నయమైపోతుందట

  • Published By: venkaiahnaidu ,Published On : March 3, 2020 / 12:06 PM IST
గోమూత్రం,పేడతో కరోనా వైరస్ నయమైపోతుందట

హైదరాబాద్,ఢిల్లీలో సోమవారం కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ నెలకొంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి,ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారు ఎవరెవరిని కలిశారు,వారితో కలిసి ప్రయాణించిన వారందిరినీ గుర్తించి వారిని హాస్పిటల్స్ కు రప్పించి కరోనా టెస్టులు చేపించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే భారత్ లోని అన్ని రాష్ట్రాలు దీని పట్ల అలర్ట్ గా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా కరోనా సోకిన దేశాల నుంచి ఎవరూ బారత్ లోకి అడుగుపెట్టుకుండా ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేసింది.

కరోనా వైరస్ కు ఇప్పటివరకు ఎలాంటి మందుమ లేదు. అయితే ఈ కరోనా వైరస్ ను గో మూత్రం, ఆవు పేడతో కేన్సర్‌ను నివారించవచ్చని ఓ బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ అసోం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ వాదిస్తున్నారు. గో మూత్రం, ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్యతో గుజరాత్‌లోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో కేన్సర్‌ పేషెంట్లకు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ నివారణకూ ఈ చికిత్స పని చేస్తుందని ఆమె తెలిపారు.

Image suman-haripriya.jpg

చైనాలో కరోనా మృతుల సంఖ్య దాదాపు 3వేలకు చేరింది. రోజురోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు చైనా తర్వాత దక్షిణకొరియా,ఇటలీలో,ఇరాక్ లో కరోనా విజృంభణ అధికస్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90వేలమంది కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.