Coronavirus Mouth Cells :కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. నోటి కణాలపైనా ప్రభావం చూపుతుంది

ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు, షాకింగ్ నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. కరోనావైరస్ పై జరుగుతున్న పరిశోధనల్లో విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో మరో భయపెట్టే విషయం వెలుగుచూసింది.

Coronavirus Mouth Cells :కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. నోటి కణాలపైనా ప్రభావం చూపుతుంది

Coronavirus Mouth Cells

Coronavirus Mouth Cells : ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు, షాకింగ్ నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. కరోనావైరస్ పై జరుగుతున్న పరిశోధనల్లో విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో మరో భయపెట్టే విషయం వెలుగుచూసింది.

కరోనా వైరస్‌ మహమ్మారి శరీరంలోని శ్వాసకోస వ్యవస్థ(lungs), రక్తనాళాలు(blood vessels), మూత్రపిండాలతో(kidneys) పాటు ఇతర అవయవాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిసిందే. తాజాగా నోటి కణాలపైనా(mouth cells) కరోనా వైరస్‌ దాడి చేస్తుందని రుజువైంది. నోటిలో కరోనా వైరస్‌ ప్రభావంపై అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

కొవిడ్‌ రోగుల్లో వాసన(smell), రుచిని కోల్పోవడం(taste loss), ఒక్కోసారి పొక్కులు(blistering) రావడం వంటి లక్షణాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పాజిటివ్‌ వచ్చిన రోగుల లాలాజలంలో(saliva) అధిక మొత్తంలో కరోనాకు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2(SARS-COV-2) ఉంటుందని తెలిసింది. దీంతో ఇతర అవయవాలకు(లంగ్స్ లేదా డైజెస్టివ్ సిస్టమ్) వైరస్‌ను వ్యాపించడంలో నోటిలోని లాలాజలం కూడా కారణమవుతున్నట్లు నిపుణులు అనుమానించారు. అంతేకాకుండా నోటి కణాలపై ఈ వైరస్‌ దాడి చేస్తుందని గమనించారు. దీనిని నిర్ధారించుకునేందుకు అమెరికాలోని జాతీయ ఆరోగ్య కేంద్రం (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌), యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.

దగ్గు, శ్వాసకోశ లక్షణాలు లేనివారిలో నోటిలో ఈ వైరస్‌ ఎలా వ్యాపిస్తుందనే విషయంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించారు. వీటిని ఆరోగ్యవంతులైన వారి నుంచి సేకరించిన నోటి నమూనాల్లోని కణాలతో(oral tissues) పోల్చి చూశారు. వీటి ద్వారా నోటిలోని కణాలు(oral tissues) కూడా సార్స్‌-కోవ్‌-2 బారినపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని గుర్తించారు. వీటిని నిర్ధారించుకునేందుకు చనిపోయిన కొవిడ్‌ రోగుల నమూనాలను సేకరించి విశ్లేషించారు. తద్వారా నోటి కణాలపై వైరస్‌ ప్రభావాన్ని స్పష్టంగా గమనించారు.

అంతేకాకుండా వైరస్‌ అధికంగా ఉన్న లాలాజలాన్ని(saliva) మింగినా, లేదా అటువంటి కణాలను(particles) పీల్చుకున్నా(inhaled) గొంతు, ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు వైరస్‌ వ్యాప్తించే అవకాశాలూ ఉన్నాయని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ కెవిన్‌ ఎం బెయార్డ్‌ వెల్లడించారు. అయితే, ఈ అధ్యయనం కొన్ని నమూనాలను పరిగణలోకి తీసుకొని చేసిందేనని.. వైరస్‌ వ్యాప్తికి నోటి కణాలు కారణమని నిర్ధారించుకునేందుకు విస్తృత పరిశోధన అవసరమని బెయార్డ్‌ అభిప్రాయపడ్డారు.

ఏడాదిన్నర కిత్రం చైనాలో పుట్టిన కరోనావైరస్ ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సెకండ్ వేడ్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కోవిడ్ కు ఇంకా రెచ్చిపోతూనే ఉంది. మనదేశంలోనూ ఓ వైపు జోరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వచ్చినా.. ప్రజలంతా పలు జాగ్రత్తలు పాటిస్తేనే.. కరోనాను కట్టడి చెయ్యడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.

కరోనా బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు:
* మాస్కుని మించిన రక్షణ లేదు.. అందుకని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించండి.
* భౌతికదూరం పాటించడం మర్చిపోవద్దు.
* చేతులు శుభ్రంగా కడుక్కోండి.
* గుంపులాగా ఉండొద్దు.. సమూహాలకు దూరంగా ఉండండి.. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి కార్యక్రమాలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏసీ హాల్స్ వంటి వాటిలో వైరస్ వ్యాప్తి ఎక్కువ. కనుక వీలైనంత వరకూ ఏసీ హాల్స్ కు దూరంగా ఉండండి.
* రోజూ ఒక గంట ఎండలో వ్యాయామం చేయండి.
* తినే ఆహార పదార్ధాల్లో ఎక్కువగా సీ విటమిన్ ఉండేలా చూసుకోండి.
* సమయానికి తగిన నిద్ర.. విశ్రాంతి తీసుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.