Samantha : సమంత మెహందీ డిజైన్‌లో భర్త రాజ్ పేరు.. అది ఎక్కడుందో తెలుసా..? మెహందీ ఆర్టిస్ట్ ఏం చెప్పిదంటే?
Samantha సమంతా మెహందీ డిజైన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మెహందీ డిజైన్ సింపుల్‌గా ఉండికూడా అందంగా ఉండటంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
Samantha
Samantha : నటి సమంత రూత్ ప్రభు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ బైరవి దేవాలయంలో సమంత రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ భూతశుద్ది పద్దతిలో వివాహం చేసుకున్నారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఎర్రటి బనారసి చీరలో సమంత మెరిసిపోతుంది. వివాహ సమయంలో ప్రతి విషయంలోనూ సమంత తన ప్రత్యేకను చాటుకుంది. ముఖ్యంగా సమంతా మెహందీ డిజైన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మెహందీ డిజైన్ సింపుల్‌గా ఉండికూడా అందంగా ఉండటంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. చెన్నైకి చెందిన మెహందీ ఆర్టిస్టు అరుల్మోళి ఇళవరసు ఈ మెహందీని డిజైన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మెహందీ డిజైన్ కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
సమంత మినిమల్ హెన్నా డిజైన్ తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇది ట్రెండ్ సెట్టర్, ప్రత్యేక ఆకర్షణ కోసం మేము వరుడి రాజ్ పేరును తన హెన్నాలో చిన్నగా డిజైన్ చేశాము. మినిమల్ డిజైన్ లను ఎంచుకోవడం వల్ల అవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వరుడి పేరు ‘రాజ్’ సమంత కుడి చేతి మధ్య వేలుపై చిన్నగా ఉంటుంది. ఈ డిజైన్‌కు దాదాపు గంట సమయం పట్టిందని మెహందీ ఆర్టిస్టు తెలిపింది. వరుడి పేరును దాచడం హెన్నా సంస్కృతిలో ఒక భాగం అని అన్నారు.
సమంతను ‘‘సంతోషంగా, చిలిపిగా ఉండే వధువు’’ అని మెహందీ ఆర్టిస్టు అరుల్మోళి పేర్కొంది. సమంతా పెళ్లి కూతురుగా ఉండటం గురించి అరుల్మోళి మాట్లాడుతూ.. ఆమె అంతా నవ్వుతూనే ఉంది. ఆమె సంతోషంగా, నవ్వుతూ కనిపించింది. మెహందీ సమయంలో రాజ్ పక్కనే ఉన్నాడు. సమంత గురించి హృదయానికి హత్తుకున్న విషయాన్ని మెహందీ ఆర్టిస్టు పేర్కొంది. ‘ఆమె చాలా సాధారణ వ్యక్తి. మనమందరం ఆమెతో కలిసిపోగలం. ఒక పెద్ద నటి అయిన తరువాత కూడా ఆమె తన సన్నిహితుల మధ్యలో ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ వివాహం చేసుకుంది. ఆమెను సంతోషంగా చూడటం మా రోజును మార్చింది అంటూ మెహందీ ఆర్టిస్టు అరుళ్మోళి ఇళవరసు పేర్కొంది.
