Sabarimala devotees : శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Sabarimala devotees : శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Sabarimala devotees
Sabarimala devotees : శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మండల పూజ సీజన్‌లో భాగంగా గత నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. రికార్డు స్థాయిలో అయ్యప్ప మాలదారులు, భక్తులు శబరిమలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచికూడా భారీ సంఖ్యలో అయ్యప్ప మాలదారులు, భక్తులు శబరిమల వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
శబరిమల వెళ్లే మాలదారులు, భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే 60 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. తాజాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు నడపనున్నట్లు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్యే నడిపే ప్రత్యేక రైలు సర్వీసులు ఈనెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను, తేదీలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.

