ఆమె ఓ మిస్టరీ : రాత్రే మాట్లాడుతుంది..పగలంతా 

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 11:05 AM IST
ఆమె ఓ మిస్టరీ : రాత్రే మాట్లాడుతుంది..పగలంతా 

కాన్పూర్‌: ఆమె ఓ విచిత్రమైన మనిషి. పగలంతా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు..రాత్రి అయితే మాట్లాడటం ఆపదు..ఇదేమిటో తెలీక కుటుంబ సభ్యలు..ఆమెను పరీక్షించిన డాక్టర్స్ తలలు పట్టుకుంటున్నారు. పగలు మౌనంగా ఉంటు.. చీకటిపడుతున్న కొద్దీ మెల్లమెల్లగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. అందరి మాటలు వింటూంది..చిన్నపిల్లలా వ్యవహరిస్తుంది. రోజులో చేయాల్సిన పనులన్నీ రాత్రివేళ చేస్తుంటుంది. ఈ వింత వ్యాధిపై పలు విధాల టెస్ట్ చేసినా ఫలితం లేకపోతోందంటున్నారు డాక్టర్స్. 
 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాన్పూర్‌లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మూడు సంవత్సరాలుగా ఆమె చికిత్స పొందుతున్న 25 ఏళ్ల వయసు కలిగిన ఆమె (పేరు వెల్లడించలేదు) రిట్రోగ్రేడ్ అమ్నేషియా అనే వ్యాధితో బాధపడుతున్నదని వైద్యులు భావిస్తున్నారు. ఓ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన క్రమంలో ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. గాయం మానినా మెమరీని కోల్పోయింది. ఆమెకు మెమరీని తెప్పించేందుకు..మ్యూజిక్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు ఏ వ్యాధి సోకిందనేది ఇంతవరకూ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆమె పగలంతా మౌనంగా ఉండి..రాత్రి వేళ  మాట్లాడుతుండటంతో ఆసుపత్రి సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుతున్నారు. న్యూరో సర్జన్ డాక్టర్ మనీష్ సింగ్ మాట్లాడుతూ ‘ఆమె గాయమైన ప్లేస్ లో మెమరీ స్టోర్ ఉండవచ్చనీ..ఇటువంటి స్థితిలో మూడు నుంచి 10 నెలల్లో మెమరీ తిరిగి వచ్చేందుకు అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాగానీ..కేవలం రాత్రివేళలో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నదో అర్థం కావటంలేదన్నారు.