Skin Care : చర్మ సంరక్షణ కోసం ఇంటి లోపల ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సూర్యుడికి బహిర్గతమయ్యే ప్రమాదం లేకుంటే నిజంగా సన్‌స్క్రీన్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే, కిటికీ దగ్గరగా ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, లేదా మీరు ఉన్న చోట సూర్యరశ్మికి నేరుగా బహిర్గతమైతే, ఇంటి లోపల ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ ధరించాల్సి ఉంటుంది.

Skin Care : చర్మ సంరక్షణ కోసం ఇంటి లోపల ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

skin care

Skin Care : సన్‌స్క్రీన్ అనేది చర్మ సంరక్షణకు తప్పనిసరిగా ఉపయోగించాల్సినది. అయితే దీనిని బయట వాతావరణంలోకి వెళ్ళే టప్పుడు వినియోగించాలా లేక ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఉపయోగించవచ్చా అన్నదానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. కోవిడ్ తరువాత ఎక్కువ మంది వ్యక్తులు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం, ఇంటి నుండే తమ ఆఫీసు పని కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.

READ ALSO : Prevent Skin Cancer : ఎండవేడి కారణంగా వచ్చే చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి చిట్కాలు, జాగ్రత్తలు !

బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ధరించడం అన్నది, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్నది అందరికీ తెలిసినప్పటికీ, ఇంటి నుండి పని చేసేటప్పుడు అదే నియమాలు వర్తిస్తాయా అనేది చాలా మందిలో అస్పష్టత నెలకొంది. ఇండోర్ ఉండే వారికోసం ఎలాంటి సన్‌స్క్రీన్‌ను ఎంపిక చేసుకోవాలన్న విషయంపై అవగాహన లేకుండా పోయింది. ఈ విషయంపై అవగాహన కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులు కొన్ని సూచనలు, సహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇంటి లోపల ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయాలా?

సూర్యుడికి బహిర్గతమయ్యే ప్రమాదం లేకుంటే నిజంగా సన్‌స్క్రీన్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే, కిటికీ దగ్గరగా ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, లేదా మీరు ఉన్న చోట సూర్యరశ్మికి నేరుగా బహిర్గతమైతే, ఇంటి లోపల ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ ధరించాల్సి ఉంటుంది. వాస్తవిక పరిస్థితిలో, ఇంటి లోపల ఉండటం, సూర్య కిరణాలకు గురికాకుండా ఉండటం అన్నది అసాధ్యం.

READ ALSO : Sandal : వేసవిలో చర్మాన్ని కాంతి వంతంగా మార్చే గంధం!.

ఇంటి లోపల ఉన్నప్పుడు, UVA మరియు UVB కిరణాలను నిరోధించే కొన్ని రకాల కిటికీలు లామినేటెడ్ గ్లాస్‌తో చేసినవి వంటివి సహాయపడతాయి. UV రేడియేషన్ నుండి ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి, సన్‌స్క్రీన్ ధరించాల్సిన అవసరం ఉండదు. అయితే, కొన్నిసార్లు, ల్యామినేషన్‌లు ఊడిపోవటం, కొన్ని రకాల గ్లాసులు UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు.

UVA కిరణాలు వృద్ధాప్యం ,చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అయితే UVB కిరణాలు దీర్ఘకాలిక టాన్స్, సన్‌బర్న్స్, చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయి, వేసవికాలంలో, UV తీవ్రత ఆల్-టైమ్ ఎక్కువగా ఉంటుంది. UV సూచిక రోజంతా 3 కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎండ వేడికి గురయ్యేవారు ఉదయాన్నే సన్‌స్క్రీన్‌ని ధరించి 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆరుబయట ఉండి తిరిగి ఇండోర్ వాతావరణానికి వస్తే మరోసారి సన్ స్ర్కీన్ ను అప్లై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Skin Fresh : వేసవిలో చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలంటే!

ఇంటి లోపల సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తే, అకాల వృద్ధాప్యా రాకడను తగ్గించుకోవచ్చు. చర్మ క్యాన్సర్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా, చర్మ సంరక్షణకు సన్ స్క్రీన్ సహాయపడుతుంది. ఇంటిలోపల ఉన్నవారు సన్‌స్క్రీన్ ధరించకుండా ఉండాలనుకుంటే ఇంటి లోపల కిటికాలకు ఎండవేడిలోపలకు ప్రవేశించకుండా కర్టెన్లు అమర్చుకోవాలని సూచిస్తున్నారు.