Yellow Tongue : కెనాడా బాలుడికి వింత వ్యాధి…పసుపు రంగులోకి మారిన నాలుక

కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ళ బాలుడు కొద్దిరోజుల క్రితం తీవ్రమైన గొంతునొప్పి, శరీరం నాలుగ పసుపచ్చరంగులోకి మారటం, కడుపునొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా పరీక్షల్లో రక్తహీనతతో పాటు, ఎప్సీన్ బార్ వైరస్ ను బాలుడి శరీరంలో వైద్యులు గుర్తించారు.

Yellow Tongue : కెనాడా బాలుడికి వింత వ్యాధి…పసుపు రంగులోకి మారిన నాలుక

Yellow Tongue

Yellow Tongue : కరోనా ప్రంపంచాన్ని ఒకవైపు కుదుపేస్తుంటే ఇదే సమయంలో అనేక రకాలైన అంతుచిక్కని వ్యాధులు వెలుగు చూస్తున్నాయి. ఈ వింత జబ్బులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏక్షణంలో ఎలాంటి వైరస్ లు తమ శరీరంపై దాడిచేస్తాయో అర్ధంకాక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకీడుస్తున్నారు. తాజాగా కెనడాలో ఓ చిన్నారికి అరుదైన వ్యాధి సోకటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేసింది.

కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ళ బాలుడు కొద్దిరోజుల క్రితం తీవ్రమైన గొంతునొప్పి, శరీరం నాలుగ పసుపచ్చరంగులోకి మారటం, కడుపునొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా పరీక్షల్లో రక్తహీనతతో పాటు, ఎప్సీన్ బార్ వైరస్ ను బాలుడి శరీరంలో వైద్యులు గుర్తించారు.

కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాలుడు బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఎర్ర రక్తకణాలపై రోగనిరోధక శక్తి దాడిచేసి నాశనం చేయటాన్ని ఈ వ్యాధి లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. ఇదొక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా ప్రకటించారు. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి రక్తహీనతతోపాటు, ఎర్రరక్తకణాలు విఛ్ఛిన్నం, కామెర్లు వంటి వాటిని కలిస్తుంది.

బాలుడికి వైద్యులు మెరుగైన వైద్య చికిత్సనందించారు. ఏడు వారాలపాటు సాగిన వైద్య చికిత్సతో ప్రస్తుతం బాలుడు కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయ్యాడు. నాలుకరంగు క్రమేపి సాధారణ స్ధితికి చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా బాలుడి శరీరంలో ఈ తరహా మార్పులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి రక్తహీనతను కలిగించటంతోపాటు, ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నం చేసి బిలిరుబిన్ పెరిగి కామెర్లకు దారితీస్తుందని యూఎస్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది.