Dried Coconut : గుండె ఆరోగ్యానికి ఎండు కొబ్బరిలోని ఫైబర్ తో ప్రయోజనమే!

రోజూ ఎండుకొబ్బరి ముక్కలు కొద్ది మోతాదులో తీసుకుంటే దానిలోని ఫైబర్ గుండెకు మేలు చేస్తుంది. మగవారిలో వంధత్వాన్ని నివారిస్తుంది. సంతానం కలిగేలా చేస్తుంది. ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు.

Dried Coconut : గుండె ఆరోగ్యానికి ఎండు కొబ్బరిలోని ఫైబర్ తో ప్రయోజనమే!

dried coconut

ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరి లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీరు, పాలు, నూనె ఇతర రుచికరమైన వంటకాలను తయారీలో ఉపయోగిస్తారు. కొబ్బరికాయ లోపల ఉండే పచ్చిగా ఉండే తెల్లటి పదార్ధాం రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరిని ప్రాసెస్ చేయబడిన రూపంలో, ముక్కలుగా, సన్నగా తురిముకుని తీసుకోవచ్చు. చాలా మంది ఎండుకొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు.

కొబ్బరిని పచ్చిగా తీసుకోవచ్చు. అలాగే కొబ్బరిని ఎండించి వివిధ రకాల వంటకాల్లో నిల్వ ఉంచుకుని ఉపయోగించవచ్చు. దీనిలో కేలరీలు ప్రొటీన్ లు, పిండి పదార్థాలు, ఫైబర్,కొవ్వు, మాంగనీస్ , రాగి, సెలీనియం ,మెగ్నీషియం, భాస్వరం, ఐరన్ ,పొటాషియం వంటివి ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

ఎండిన కొబ్బరి శరీరంలో రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది. అలాగే ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. కొబ్బరిని ఆహారంలో చేర్చడం వలన ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది. శరీర కణాల ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. పొడి కొబ్బరి తినడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యానికి ఎండు కొబ్బరి తోడ్పడుతుంది.

రోజూ ఎండుకొబ్బరి ముక్కలు కొద్ది మోతాదులో తీసుకుంటే దానిలోని ఫైబర్ గుండెకు మేలు చేస్తుంది. మగవారిలో వంధత్వాన్ని నివారిస్తుంది. సంతానం కలిగేలా చేస్తుంది. ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు. పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా తోడ్పడుతుంది.

మలబద్ధకం, అల్సర్ వంటి పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎండుకొబ్బరి తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎనీమియా సమస్యకు చెక్ పెట్టాలంటే ఎండుకొబ్బరి తీసుకోవటం మంచిది. మతిమరపు సమస్యలు దూరమవుతాయి. మెదడులోని నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. పక్షవాతం నుండి కాపాడుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు ఉంటే ఎండుకొబ్బరి సరైన పరిష్కార మార్గం.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పొందటం మంచిది.