కరోనాతో వాసన-రుచి కోల్పోయామనే భావన.. ఊహించినదానికంటే మానసికంగా దెబ్బతీస్తుందంట!

కరోనాతో వాసన-రుచి కోల్పోయామనే భావన.. ఊహించినదానికంటే మానసికంగా దెబ్బతీస్తుందంట!

Loss Of Smell COVID-19 Symptom : మీ ఇంట్లో ఏదో కాలిపోతున్న వాసన తెలియడం లేదా? గ్యాస్ లీక్‌ను గ్రహించకలేకపోతున్నారా? లేదా శరీరపు వాసనలు తెలియడం లేదా? అంటే.. కరోనా కావొచ్చు.. ఇదే చాలామందిలో కనిపిస్తోన్న ఆందోళన.. కరోనా సోకిందేనే భయం, ఆందోళన తీవత్ర పెరిగి మానసికంగా ప్రభావితం చేస్తోంది అంటున్నారు నిపుణులు.. వాస్తవానికి రుచి, వాసన కోల్పోవడాన్ని కరోనా లక్షణంగా గుర్తించారు. కరోనా మహమ్మారి లక్షణాల్లో వాసన, రుచి కోల్పోవడం అనేది ప్రధాన సంకేతాలే. తినే ఆహార పదార్థాల్లో రుచితో పాటు కమ్మని వాసన వస్తుంటుంది. వాసన చూడగానే వెంటనే తినేయాలనే కోరిక కలుగుతుంది. ఒకవేళ ఉన్నట్టుండి వాసన, రుచి రెండూ కోల్పోతే ఏమౌతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో అందరికి గుర్తుచ్చేది కరోనా వైరస్.. వెంటనే దీన్ని కరోనా లక్షణంగా తేల్చేస్తారు.

వాస్తవానికి అది కరోనా లక్షణమో కాదో తెలియక ముందే ఆందోళన చెందుతుంటారు. మానసికంగా కృంగిపోతుంటారు. కరోనా అసాధారణ లక్షణమైన వాసన చూడలేకపోవడం అనేది పెద్ద సమస్యే కాదు.. కానీ, దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు సైంటిస్టులు. ఆందోళనతో పాటు నిరాశ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఊహించినదానికంటే అతిగా ఆలోచిస్తుంటారు. తద్వారా మానసిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనోస్మియా (వాసన కోల్పోవడం)బాధితుల్లో ఆందోళన అధికంగా కనిపిస్తుందని చెబుతున్నారు. వాసన, రుచి అనేవి భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయని కొత్త పరిశోధనలో తేలింది. కరోనావైరస్ బాధితుల్లో వాసన భావాన్ని న్యూరాన్లకు నేరుగా సోకడం ద్వారా కాకుండా సహాయక కణాల పనితీరును ప్రభావితం చేస్తుందని అధ్యయన రచయిత ఒకరు పేర్కొన్నారు.

2020 ఏడాది ముగిసే సమయానికి కరోనాతో రుచి, వాసన కోల్పోయే వాస్తవ జనాభా శాతం ఇంకా ఎంత ఉందో ఖచ్చితమైన డేటా లేదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్ న్యూరాలజీ.. డిసెంబర్ 9 ఆన్‌లైన్ సంచికలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మార్చిలో కరోనాతో ఇటాలియన్ ఆస్పత్రిలో చేరిన వారిలో మూడింట రెండొంతుల మంది వాసన, రుచిని కోల్పోయారు. వాసన, రుచి కోల్పోవడం 58 మందిలో లేదా గ్రూపులో 63శాతం మంది ఉన్నారు. పాల్గొన్న 58 మందిలో 13 మందికి (22శాతం) వాసన రుచి కోల్పోవడం మొదటి లక్షణంగా గుర్తించారు. వాసన, రుచి కోల్పోయే సగటు వ్యవధి 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఇటలీ అధ్యయనం ప్రకారం.. వాసన, రుచి భావాన్ని కోల్పోని కరోనా వైరస్-సోకిన రోగులతో పోలిస్తే.. వాసన భావన ఉన్నవారిలో తక్కువ రక్తపు కణాలు లేదా ల్యూకోసైట్లు ఉన్నాయని తేలింది.

తెల్ల రక్త కణాల సంఖ్య, న్యూట్రోఫిల్స్ తగ్గినట్టు గుర్తించారు. ఈ కణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సాయపడతాయి. రుచి, వాసన కోల్పోయే మొదటి లక్షణాలు ఉన్నవారికి.. చాలా కొద్ది మందికి ముక్కు దిబ్బెడ ఉందని గుర్తించారు. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం అనేది కరోనా లక్షణాలకు అవకాశం లేదంటున్నారు. అయినప్పటికీ, రక్త కణాల అసమతుల్యత కారణంగా కూడా వాసనను కోల్పోవడంతో సంబంధం ఉంటుందని అధ్యయనంలో తేలింది. వాసన, రుచి కోల్పోవడమనే భావన ఎంతకాలం ఉంటుందంటే.. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గాఢమైన వాసనలు క్రమం తప్పకుండా చూస్తుంటే వారిలో మళ్లీ (olfactory system) ను పునరుద్దరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.