Dehydrating Drinks : మిమ్మల్ని డీహైడ్రేటింగ్ కు గురిచేసే 5 పానీయాలు ఇవే !

ఒక కప్పు కాఫీ తో చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటామని అనుకొంటారు. అయితే కాఫీలోని కెఫిన్ మూత్రవిసర్జన ,నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు సేవించటం అవసరం.

Dehydrating Drinks : మిమ్మల్ని డీహైడ్రేటింగ్ కు గురిచేసే 5 పానీయాలు ఇవే !

Dehydrating Drinks

Dehydrating Drinks : ఈ విషయం చెప్పటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాస్తవానికి కొన్ని పానీయాలు మిమ్మల్ని హైడ్రేట్ చేయడానికి బదులుగా డీహైడ్రేట్ కు గురిచేస్తాయి. ఆ పానీయాలు తాగడం ద్వారా శరీరానికి మేలు కలుగుతుందని భావించినా,నిజానికి అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేటింగ్ కు గురిచేసే ఆ పానీయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Dehydration In Winter : చలికాలంలో డీహైడ్రేషన్ సమస్యా? ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందా?

హైడ్రేటెడ్ గా ఉండాలనుకుంటే నివారించాల్సిన పానీయాలు ;

1. కాఫీ: ఒక కప్పు కాఫీ తో చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటామని అనుకొంటారు. అయితే కాఫీలోని కెఫిన్ మూత్రవిసర్జన ,నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు సేవించటం అవసరం.

2. ఆల్కహాల్: ఆల్కహాల్ అనేది ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు దారితీస్తుంది. దీని వల్ల మన శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ ద్రవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇది మూత్రవిసర్జనను పెంచడమే కాకుండా, నీటిని నిలుపుకునే శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. దీంతో నిర్జలీకరణానికి గురవుతారు.

READ ALSO : డీహైడ్రేషన్ ఎంత డేంజరంటే? సంకేతాలివే..!

3. శీతల పానీయాలు: సోడాలు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఈ డ్రింక్స్‌లోని చక్కెర వల్ల శరీరం ఎక్కువ నీటిని విసర్జించేలా చేస్తుంది, తద్వారా శరీరం వాడిపోయినట్లవుతుంది.

4. స్పోర్ట్స్ డ్రింక్స్: స్పోర్ట్స్ డ్రింక్స్ వ్యాయామం చేసే సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ , ఫ్లూయిడ్‌లను భర్తీ చేసేందుకు ఉపయోగపడతాయి. అయితే వాటిలోని అధిక చక్కెర కంటెంట్ డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. స్పోర్ట్స్ డ్రింక్ తాగబోతున్నట్లయితే, ముందుగా పుష్కలంగా నీరు త్రాగాలని గుర్తుంచుకోండి.

READ ALSO : ఈ ఫలాలతో.. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యకు చెక్..!

5. టీ: టీ తాగటం వల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కారణంగా ద్రవాలను కోల్పోయేలా చేస్తుంది. ఎంత ఎక్కువ టీ తాగితే, దాన్ని భర్తీ చేయడానికి ఎక్కువ నీరు తాగటం అవసరం. డీహైడ్రేషన్ , నోరు పొడిబారకుండా ఉండేందుకు టీ ఎక్కువగా తాగే వారు పుష్కలంగా నీరు త్రాగాలని గుర్తుంచుకోండి.

ఈ నిర్జలీకరణ పానీయాలను నివారించడం ద్వారా, శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవచ్చు. పుష్కలంగా నీరు , కొబ్బరి నీరు, హెర్బల్ టీలు , పాలు వంటి ఇతర హైడ్రేటింగ్ పానీయాలు త్రాగటం ఆరోగ్యానికి మంచిది. ఈ పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉండేలా చేస్తాయి.