Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

మామిడి పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సజావుగా పంపించడంలో సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పని చేస్తుంది. అంతేకాదు.. మామిడి పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

fruits

Stomach Health : తిన్నది అరగకపోవడం, తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం సమస్యలు చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. ఇవి సాధారణంగా కనిపించే సమస్యలే అయినా చాలా ఇబ్బంది పెడుతాయి. ఇలాంటి సమస్యలున్నప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. ఏ పనీ తోచదు.

READ ALSO : Black Rice : బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సరైన సమయానికి తినకపోవడం, టైంకి నిద్రపోకపోవడం.. ఇలా మారిన మన జీవనశైలి మన జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తోంది. అందుకే ఎక్కువమందిలోకడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రుచిగా ఉందని ఒక ముద్ద ఎక్కువ తిన్నా కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. కొన్నిసార్లు అజీర్ణ సమస్య వెంటాడుతుంది. మనం తినే ఆహారమే మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిసిందే. అయితే పేగుల కదలికలు సక్రమంగా ఉండాలన్నా, పొట్ట సంబంధిత సమస్యలు నివారించాలన్నా కొన్ని రకాల పండ్లను రెగులర్ తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.

యాపిల్ :

యాపిల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే పండ్లలో ఒకటి. ఇందులో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకం, డయేరియా వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించే సామర్థ్యం యాపిల్స్ లో ఉంటుంది.

READ ALSO : Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఆహారంలో టమోటాలను తీసుకోకూడదు ఎందుకో తెలుసా ?

అరటిపండు :

మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయా? అయితే రెండు అరటిపండ్లు తినండి. కచ్చితంగా మోషన్స్ తగ్గుతాయి. అరటిపండ్లు కడుపులో అల్సర్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అంతేకాదు.. జీర్ణవ్యవస్థను సెట్ చేయగల శక్తి అరటిపండ్లలో ఉంటుంది. కాబట్టి మీ కడుపు కూడా అసహజంగా అనిపించదు.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

మామిడి పండ్లు :

మామిడి పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సజావుగా పంపించడంలో సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పని చేస్తుంది. అంతేకాదు.. మామిడి పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మామిడి పండ్లను అలాగే తిన్నా పరవాలేదు.. లేకపోతే స్మూతీగా, జ్యూస్ గా అయినా తీసుకోండి.

కివి :

కివిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఇదొక మంచి ఔషధంగా పని చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో ఉండే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ సాధారణంగా పొట్టకు భారంగా ఉండే ప్రోటీన్ లు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి దీన్ని మీకు నచ్చిన రీతిలో తీసుకోవచ్చు. కివి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పెంచే పండు.

READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

ఆప్రికాట్స్ :

ఆప్రికాట్స్ లో.. విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. పేగు కదలికలను కూడా సరిచేస్తుంది. మలబద్దకం సమస్యలను ఎదురుకోకుండా చేస్తుంది. అందుకే రోజువారీ డైట్ లో ఈ పండును కూడా చేర్చండి.

ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. ఇలా సమస్య ఏదైనా సరే ఉపశమనం కలుగాలంటే ఈ పండ్లను తినండి. ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.