నేను ఎదుర్కొంటా.. వచ్చే కొన్ని రోజులే అసలైన పరీక్ష.. ఆస్పత్రి నుంచి ట్రంప్ వీడియో

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 12:48 PM IST
నేను ఎదుర్కొంటా.. వచ్చే కొన్ని రోజులే అసలైన పరీక్ష.. ఆస్పత్రి నుంచి ట్రంప్ వీడియో

trump coronavirus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటినుంచి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ ఆరోగ్యం విషమంగా ఉందని, లేదు లేదు ట్రంప్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవైపు డాక్టర్లు అధ్యక్షుడు బాగానే ఉన్నారని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ ఆరోగ్యంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ఆస్పత్రి నుంచి ఓ వీడియోను పోస్టు చేశారు.



నాలుగు నిమిషాల నిడివి గల వీడియోలో ట్రంప్.. తన ఆరోగ్యం బాగానే ఉందని, వచ్చే కొన్ని రోజులే తనకు అసలైన పరీక్ష అంటూ పోస్టు చేశారు. కానీ, వైట్ హౌస్ చీప్ సిబ్బంది చెబుతున్న ప్రకారం.. ట్రంప్ విటల్స్ (శరీర ఉష్ణోగ్రత, పల్స్ రేటు, బీపీ) అన్ని అదుపులోనే ఉన్నాయని ఆయన చికిత్సకు స్పందిస్తున్నారంట.. కాకపోతే.. వచ్చే 48 గంటలు చాలా క్రిటికల్ అంటున్నారు..



ట్రంప్ వీడియోలో.. ‘నాకు అస్వస్థతగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చాను. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది’ అని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం బాగానే ఉంది.. వచ్చే ఈ కొన్నిరోజులే అసలైన పరీక్ష.. ఎలా ఉంటుందో ఊహించలేనంతగా ఉంది. త్వరలో కోలుకుని తిరిగి వస్తానని, తన క్యాంపియన్ పూర్తి చేస్తానని ట్రంప్ చెప్పారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ట్రంప్ శుక్రవారమే Walter Reed hospital వెళ్లి అడ్మిట్ అయ్యారు.



కరోనాకు చికిత్సగా ట్రంప్‌కు ప్రయోగదశలో ఉన్న Remdesivir డ్రగ్ ఇస్తున్నామని వైట్ హౌస్ డాక్టర్ వెల్లడించారు. ట్రంప్ మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. ఏదిఏమైనా కరోనా వైరస్ ను ఎదుర్కొంటున్నాను.. మహమ్మారిని జయించి తిరిగి వస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దేవుడి నుంచి కొన్ని అద్భుతాలంటూ ప్రయోగాత్మక చికిత్సలను ఉద్దేశించి ప్రస్తావించారు.