కరోనాకు విటమిన్ ‘డి’ ట్రీట్‌మెంట్.. 60శాతం తగ్గిన మరణాలు : కొత్త స్టడీ

కరోనాకు విటమిన్ ‘డి’ ట్రీట్‌మెంట్.. 60శాతం తగ్గిన మరణాలు : కొత్త స్టడీ

Vitamin D as coronavirus treatment : కరోనావైరస్‌కు విటమిన్ ‘డి’ ద్వారా ట్రీట్‌మెంట్ చేయొచ్చునని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభించాలని రీసెర్చర్లు సూచిస్తున్నారు. కరోనా చికిత్సకు విటమిన్ డి చికిత్స ద్వారా బాధితుల్లో 60 శాతం కరోనా మరణాలు తగ్గినట్టు తేలిందని అంటున్నారు. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్ ప్రచురించిన అధ్యయనంలో తేలిందని మాజీ బ్రిగ్జిట్ సెక్రటరీ ఎంపీ డేవిడ్ దేవిస్ వెల్లడించారు.

calcifediol అనే విటమిన్ డి3 కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలిందన్నారు. స్పెయిన్ లో కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన 550 మందికి పైగా బాధితుల్లో వారి వార్డుల్లో ‘డి’ విటమిన్ ఇచ్చి పరీక్షించారు. వీరిపై calcifediol చికిత్స ఎలా పనిచేస్తుందో ట్రయల్ ద్వారా అధ్యయనం చేశారు. 15 రోజుల వ్యవధిలో రెండు, నాలుగు, ఎనిమిది చొప్పున పెంచుతూ విటమిన్ ఐదు మోతాదుల్లో కరోనా బాధితులకు ఇచ్చారు.

ప్రతి ఆస్పత్రిలోని కరోనా బాధితుల టెంపరేచర్ సహా లక్షణాల తీవ్రతపై లోతుగా అధ్యయనం చేశారు. దీని ద్వారా వేలాది మందిని కరోనా మరణాల నుంచి కాపాడటం సాధ్యపడిందని రీసెర్చర్లు చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత తొందరగా విటమిన్ డి ట్రీట్ మెంట్ కరోనా బాధితులకు ఇవ్వడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. విటమిన్ డి చికిత్స తీసుకున్న కరోనా బాధితుల్లో 80శాతం వెంటిలేటర్ అవసరం అవకాశం లేదని అధ్యయనంలో తేలింది.