ఆ మూడు బెస్ట్ : 20 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్యం మారిపోయింది

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 07:53 AM IST
ఆ మూడు బెస్ట్ : 20 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్యం మారిపోయింది

20 ఏళ్లలో  అనూహ్య మార్పు
ఐదేళ్ల లోపు శిశు మరణాలు 50 శాతం తగ్గుదల
రోటావైరస్  ఎదుర్కొన్న భారత్ 
వాషింగ్టన్ లో అంతర్జాతీయ సదస్సు

వాషింగ్టన్: గత 20 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్యం ఎంతగానో మారిపోయిందని బిల్ గేడ్స్ భార్య..గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు  మెలిండా గేట్స్ తెలిపారు. జనవరి 17న వాష్టింగ్ స్టన్ లో జరిగిన ప్రపంచ సదస్సులో పాల్గొన్న బిల్ గేట్స్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మెలిండా గేట్స్ మాట్లాడుతు..గత రెండు దశాబ్దాలలో ప్రజల పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయని..ముఖ్యంగా ఫైనాన్షియల్ డెవలప్ మెంట్ లో భారతదేశంతో పాటు వియత్నాం, ఇండోనేషియా దేశాలో ఆరోగ్య సూచి (health index)లో గత 20 సంవత్సరాల క్రితం కంటే మరింత మంచి స్థానంలో ఉన్నాయనీ మెలిండా తెలిపారు. 

గత రెండు దశాబ్దాలలో ప్రపంచలో  పేదల సంఖ్య తగ్గడమే కాకుండా..వారి ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడిందని బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా తెలిపారు. 1990 తరువాత ఐదేళ్లలోపు శిశువుల మరణాల రేటు 50 శాతం తగ్గిందని చెప్పారు. భారత్ ఎంతో పెద్ద దేశమైనప్పటికీ రోటావైరస్ వ్యాక్సిన్‌ను సమర్థవంతంగా ప్రజలకు అందించారని ప్రశంసించారు. అలాగే న్యూమోకాకస్ వ్యాక్సిన్‌ను భారత్‌లో అందజేయనున్నారని తెలిపారు. హెచ్‌ఐవీ, మలేరియా, మశూచి వంటి వ్యాధుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య 1990 తరువాత సగానికి తగ్గిపోయిందని మెలిండా చెప్పారు.