Lancet study: మ‌ద్యం వ‌ల్ల 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి తీవ్ర‌ ముప్పు

మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న ఉన్న వృద్ధుల కంటే యువ‌త‌కే దాని వ‌ల్ల అధిక ముప్పు ఉంటుంద‌ని పరిశోధకులు పేర్కొన్నారు. 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు ఉన్నవారికి మ‌ద్యం వ‌ల్ల అనేక ఆరోగ్య సంభ‌వించే ముప్పు ఉంటుంద‌ని చెప్పారు.

Lancet study: మ‌ద్యం వ‌ల్ల 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి తీవ్ర‌ ముప్పు

Alchohol

Lancet study: మ‌ద్యం తాగడం వ‌ల్ల ఎన్నో అరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ని అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం అల‌వాటు చేసుకున్న వారు దాన్ని వ‌దులుకోలేక‌పోతుంటారు. కొద్దిగా తాగితే ఏమీ కాద‌ని భావిస్తూ మ‌ద్యాన్ని అల‌వాటు చేసుకుని, చివ‌ర‌కు దానికి బానిస అయిపోతారు. మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న వారిలో త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ గురించి ఇప్ప‌టికే ఎన్నో పరిశోధ‌న‌లు జ‌రిగాయి. తాజాగా, అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు చేసిన ఓ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను లాన్సెట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న ఉన్న వృద్ధుల కంటే యువ‌త‌కే దాని వ‌ల్ల అధిక ముప్పు ఉంటుంద‌ని పేర్కొన్నారు. 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు ఉన్నవారికి మ‌ద్యం వ‌ల్ల అనేక ఆరోగ్య సంభ‌వించే ముప్పు ఉంటుంద‌ని చెప్పారు. అయితే, 40 ఏళ్ళ వ‌య‌సు పైబ‌డి ఉండి ప్ర‌తిరోజు అతి త‌క్కువ మోతాదులో మ‌ద్యం తీసుకునే వారికి కొన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని తెలిపారు. హృద‌య‌నాళ రోగాలు, స్ట్రోక్, మ‌ధుమేహం వంటి వాటి నుంచి ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌ని గుర్తించిన‌ట్లు చెప్పారు. దాదాపు 204 దేశాల నుంచి మందుబాబుల వివ‌రాలపై అధ్య‌య‌నం చేసి ఈ వివ‌రాలు తెలిపారు. 15 నుంచి 39 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారే అధిక మోతాదులో మ‌ద్యం తాగుతున్న‌ట్లు గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు.

Sri Lanka: ఎట్ట‌కేల‌కు అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా.. శ్రీ‌లంక‌లో సంబ‌రాలు

ఈ వ‌య‌సు వారికి మ‌ద్య‌పానం వ‌ల్ల ఎటువంటి అరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉండ‌డం లేద‌ని తెలిపారు. అంతేగాక‌, ఈ వ‌య‌సు వారు మ‌ద్యం తాగుతుండ‌డం వ‌ల్ల వాహ‌న ప్ర‌మాదాల బారిన‌ప‌డుతుండ‌డం, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుండ‌డం, హ‌త్య‌లు వంటి నేరాల‌కు పాల్ప‌డుతుండ‌డం వంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని చెప్పారు. ఈ వ‌య‌సులో ఉన్న వారు మ‌ద్యాన్ని ముట్టుకోక‌పోవ‌డం మంచిద‌ని ప‌రిశోధ‌కులు సూచించారు.