Sri Lanka: ఎట్ట‌కేల‌కు అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా.. శ్రీ‌లంక‌లో సంబ‌రాలు

శ్రీ‌లంక అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స ఎట్ట‌కేల‌కు రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా చేయాల‌ని శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొద‌ట శ్రీ‌లంక నుంచి మాల్దీవుల‌కు పారిపోయిన గొట‌బాయ రాజ‌ప‌క్స, నేడు అక్క‌డి నుంచి నేడు సింగ‌పూర్‌కు చేరుకున్నారు.

Sri Lanka: ఎట్ట‌కేల‌కు అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా.. శ్రీ‌లంక‌లో సంబ‌రాలు

Sri Lanka’s deposed president

Singapore: శ్రీ‌లంక అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స ఎట్ట‌కేల‌కు రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామా చేయాల‌ని శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొద‌ట శ్రీ‌లంక నుంచి మాల్దీవుల‌కు పారిపోయిన గొట‌బాయ రాజ‌ప‌క్స, నేడు అక్క‌డి నుంచి నేడు సింగ‌పూర్‌కు చేరుకున్నారు. మాల్దీవుల నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం-ఎస్వీ 788లో రాజ‌ప‌క్స సింగ‌పూర్ చాంగీ విమానాశ్ర‌యం చేరుకుని అక్క‌డి నుంచి ఓ హోట‌ల్‌కు వెళ్ళిన‌ట్లు తెలుస్తోంది.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

శ్రీ‌లంక పార్లమెంట్ స్పీక‌ర్‌కు ఆయ‌న రాజీనామా లేఖ పంపారు. త‌న‌కు ఆయ‌న నుంచి లేఖ అందింద‌ని స్పీక‌ర్ చెప్పారు. రాజ‌ప‌క్స రాజీనామా చేశాడ‌ని ప్ర‌క‌ట‌న రావ‌డంతో శ్రీ‌లంక ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. బాణ‌సంచా కాల్చుతూ డ్యాన్సులు చేస్తున్నారు. కాగా, శ్రీ‌లంక నుంచి గొట‌బాయ రాజ‌ప‌క్స పారిపోయిన‌ప్ప‌టికీ ఆందోళ‌న‌కారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగించారు. చివ‌ర‌కు ఆందోళ‌న‌కారుల డిమాండ్ నెర‌వేరింది. ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే కొనసాగుతున్నారు. దేశ వ్యాప్తంగా చెలరేగుతోన్న ఆందోళనలను అణచివేయాలని ఆయన ఇప్పటికే శ్రీలంక సైన్యాన్ని ఆదేశించారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల దేశ పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేకుండాపోయాయి.