చుక్ చుక్ బండి : హైదరాబాద్ రైలుకు 150 ఏళ్లు

  • Published By: madhu ,Published On : October 10, 2019 / 03:16 AM IST
చుక్ చుక్ బండి : హైదరాబాద్ రైలుకు 150 ఏళ్లు

1870 అక్టోబర్ 10న ప్రజా రవాణాలో కీలక ఘట్టం. నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. రైలు ప్రయాణాన్ని నగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి నేటికి 150 ఏళ్లు.  సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడి మధ్య తొలి రైలు లైన్ వేయగా..1874 అక్టోబర్ 10వ తేదీన 150 మంది ప్రయాణీకులతో రైలు ప్రయాణం ప్రారంభమైంది. అలా మొదలైన ప్రయాణం..తక్కువ సమయంలోనే విస్తరించింది. భారత రైల్వేలోనే కీలకంగా మారింది. ఆధునిక హంగులతో ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఎంఎంటీఎస్, మెట్రో రూపంలో అందుబాటులోకి వచ్చింది. 

కీలకమైన హైదరాబాద్ – కాజిపేట – బెజవాడ లైన్ కూడా 1891 నాటికి రెడీ అయ్యింది. మద్రాసు రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం సింగరేణి ఇల్లందుకు అప్పట్లోనే రైల్వే ట్రాక్ చేశారు. బొగ్గుబండి నుంచి సూపర్ ఫాస్ట్ దాక..ఎంఎంటీఎస్ నుంచి మెట్రో దాకా తన ప్రస్థానానికి నూతన తళుకులు అద్దుకుంది హైదరాబాద్ రైలు. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాం హయాంలో ప్రతిదీ ప్రత్యకమే. నిజాంలకు సొంత కరెన్సీ, పోస్టల్, ఎయిర్ వేస్ ఉండేవి. వీటికి తోడు అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే సొంత రైల్వే వ్యవస్థ. భారతదేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది హైదరాబాద్ ఒక్కటే కావడం గమనార్హం. 

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్త దక్షిణ భారతాన్ని కలిపే రైల్వే లైన్ పనులన్నీ..19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1951 నాటికి 2 వేల 353 మేర కి.మీటర్ల పట్టాలను పరిచారు. నిజాం స్టేట్ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో విలీనం చేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారి పోయింది. 

నిజాం పాలకులు ప్రయాణించడానికి ప్రత్యేక రైలు బోగిని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు ప్రత్యేక రైలులోనే వెళ్లారు. ఈ రైలులో నిజాం పాలకుల కోసం బెడ్రూం, కిచెన్, సెలూన్ బాత్రూం ఉండేవి. సికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లో ఈ రైలు ఉండేవి. నాంపల్లి రైల్వే స్టేషన్ 1907లో మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ హయాంలో నిర్మించారు. 1921 వరకు ప్రయాణికులకు అనుమతించలేదు. స్టేషన్‌ను రైళ్ల కోసం వినియోగించారు