ఇంటర్ జేఏసీ నేత ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్‌సుక్ నగర్‌లోని ఆయన

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 07:18 AM IST
ఇంటర్ జేఏసీ నేత ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్‌సుక్ నగర్‌లోని ఆయన

తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత, ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్‌సుక్ నగర్‌లోని ఆయన నివాసంలో సోదాలు జరుపుతున్నారు. శుక్రవారం(అక్టోబర్ 4,2019) ఉదయం 6గంటల నుంచి మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు.

ఇంటర్ బోర్డు అక్రమాల్లో మధుసూదన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత మధుసూదన్‌ రెడ్డికి ఎంత మేరకు ఆస్తులున్నాయన్న విషయంపై వివరణ ఇస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో నగదుతోపాటు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మధుసూదన్ రెడ్డి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి పదవిలో ఉన్నారు.

హైదరాబాద్ లో ఉన్న మధుసూదన్ రెడ్డి బంధువుల ఇళ్లు, కొడంగల్ లోని మధుసూదన్ రెడ్డి సోదరుడి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు గుర్తించారు. ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకల్లో మధుసూదన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలకు చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉద్యోగులతో మధుసూదన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ఆ విధంగా అక్రమాలకు పాల్పడి ఆస్తులు కూడబెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి.

2007 ఇంటర్ పేపర్ లీకేజ్ లో మధుసూదన్ రెడ్డిని కీలక సూత్రధారిగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 3 ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్కయ్యారని, మార్క్స్ మేనేజ్ చేశారని.. ప్రమోషన్ల పేరుతో జూనియర్ లెక్చరర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. అధికారులు లోనికి ఎవరినీ అనుమతించడం లేదు. తలుపులే వేసి మరీ సోదాలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది.