ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 11:06 AM IST
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషనర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు వివరిస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వం తరపున ఏఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించనున్నారు. 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం సమాచారాన్ని ఆర్టీసీకి ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా కేవలం ఏకపక్ష ధోరణితో నిర్ణయం తీసుకుందంటూ కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరిస్తున్నారు.

మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేబినెట్ డిసిషన్ ఇంకా పూర్తి కాలేదు. ప్రాసెస్ లో మాత్రమే కొనసాగతుందని తెలిపింది. ఫైనల్ అయ్యాక జీవో రూపంలో తీసుకొచ్చాక దీన్ని ప్రజల ముందు ఉంచుతామని ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ లో వెల్లడించారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ గతంలో హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ పై పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల తర్వాత ఏఏజీ తన వాదనలు వినిపించనునున్నారు. 

నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఆర్టీసీ, ప్రైవేట్ వ్యవస్థలను సమాంతరంగా చూసినప్పుడు కేబినెట్ నిర్ణయాలు ఎలా చట్ట విరుద్ధమవుతాయో చెప్పాలని పిటిషనర్ ను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కమిషనర్ కు బదిలీ చేసింది. 27 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటూ దాఖలైన పిటిషన్ పై కూడా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఆత్మహత్యలు, గుండె పోటుతో చనిపోయిన వారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని లేబర్ కమిషన్ తెలిపింది.