నేరాలను పట్టిస్తున్న టెక్నాలజీ : గొలుసు దొంగలను పట్టించిన గూగుల్ పే 

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 04:07 AM IST
నేరాలను పట్టిస్తున్న టెక్నాలజీ : గొలుసు దొంగలను పట్టించిన గూగుల్ పే 

హైదరాబాద్‌ :  నేరాలను పట్టించే విషయంలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలను టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు పోలీసులు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన దొంగలను  టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 19 గంటల్లో  11 చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన నగరవాసులను భయభ్రాంతులకు గురి చేసిన దొంగలు ఎట్టకేలకు పట్టుబడ్డారు. 

ఈ ఘటనలను సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన క్రమంలో సీసీ పుటేజ్ ద్వారా వారంతా నార్త్ ఇండియన్స్ గా నిర్ధారించుకుని..ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్లి దర్యాప్తు చేసారు.  అనంనతరం వారంతా హైదరాబాద్ లోనే వున్నారని నిర్ధారించుకుని వారు నోయిడాకు చెందిన మోనా వాల్మీకి, బులంద్‌షహర్‌కు చెందిన చోకా, హైదరాబాద్‌కు చెందిన చింతమళ్ల ప్రణీత్ చౌదరిగా గుర్తించారు. అనంతరం వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు ఓ హోటల్ లో వున్న క్రమంలో హోటల్ బిల్ ను  గూగుల్ పే ద్వారా చెల్లింటచంతో బైటపడిన గుట్టుతో వారిని ఈదీబజార్‌లో బైక్‌పై వెళ్తున్న మోను, చోకాలను జనవరి 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారంతో హోటల్‌లో ఉన్న ప్రణీత్ చౌదరిని పట్టుకున్నారు. 

పట్టుబడివారి నుంచి 350 గ్రాముల బంగారం..రెండు బైక్‌లు..ఒక డాగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్రూపు వారి స్థానిక ప్రాంతంలో కూడా 150కిపైగా దొంగతనాలు చేసినట్టు విచారణలో వెల్లడయ్యిందని  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. ప్రణీత్ చౌదరి తాను బసచేసిన హోటల్ బిల్లును గూగుల్ పే ద్వారా చెల్లించాడని, నిందితులను పట్టుకోవడంలో ఈ లావాదేవీ కీలకం అయిందని సీపీ తెలిపారు.